చంద్రబాబులా అవకాశవాదిని కాను: పవన్‌ కల్యాణ్‌

Janasena Chief Pawan Kalyan Fires On Chandrababu In Kakinada - Sakshi

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీని వెనకేసుకు రావడానికి నేనేమీ చంద్రబాబులా అవకాశవాదిని కానన్నారు. సామాజిక మార్పు కోసమే జనసేన పార్టీని పెట్టాను తప్ప..బీజేపీలో కలపడానికి కాదని వ్యాక్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీతో గొడవ పెట్టుకునే నైతిక బలం చంద్రబాబుకు లేదని చెప్పారు. టీడీపీకి ఏపీ ప్రజలపై ఆకాంక్ష ఉంటే ప్రత్యేక హోదా కోసం ఉమ్మడిగా పోరాటం చేద్దాం రండి అని పిలుపునిచ్చారు.

దీనిపై చంద్రబాబుకు మంత్రి యనమల రామకృష్ణుడు సలహా ఇవ్వాలని సూచించారు. మంత్రి లోకేష్‌ సైకిల్‌ తొక్కడం మానేసి రండి..మీ సైకిల్‌కు పంచర్‌ పడిందని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలవలేని లోకేష్‌ పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రిగా ఉన్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. టీడీపీ అవినీతిలో భాగస్వామ్యం వద్దనే తాను ఒక్క పదవిని కూడా తీసుకోలేదని తెలిపారు. డ్వాక్రా మహిళలను టీడీపీ కార్మికులుగా చేసేశారని తీవ్రంగా మండిపడ్డారు. వ్యవస్థను టీడీపీ చిన్నాభిన్నం చేస్తోందని విమర్శించారు.

ఎమ్మెల్యేల ప్రాణాలను కాపాడలేని మీరు ముఖ్యమంత్రిగా సమర్ధులేనా అని ప్రశ్నించారు. వియ్యంకుడికి పోలవరం కాంట్రాక్టు పనులు ఇప్పించడంలో యనమల రామకృష్ణుడికి ఉన్న ఉత్సాహం..తన నియోజకవర్గంలో కాలుష్యాన్ని నివారించాలన్న విషయంలో మాత్రం లేదని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top