పొన్నం క్షమాపణ చెప్పాలి: గంగుల | Gangula kamalakar about ponnam prabhakar | Sakshi
Sakshi News home page

పొన్నం క్షమాపణ చెప్పాలి: గంగుల

Aug 18 2018 3:17 AM | Updated on Aug 18 2018 3:17 AM

Gangula kamalakar about ponnam prabhakar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నాయకుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్‌ నాయకులు బొందల గడ్డగా మార్చిన కరీంనగర్‌ను కేటీఆర్‌ అభివృద్ధి చేశాడని తెలిపారు. తెలంగాణ సాధించుకోవాలనే లక్ష్యంతోనే కేటీఆర్‌ అమెరికా వదిలిపెట్టి వచ్చాడని, ఆయనను విమర్శించే నైతిక హక్కు పొన్నం ప్రభాకర్‌కు లేదన్నారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి కోసమే పొన్నం నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement