టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వేటు వేయండి 

congress leaders demand on TRS MLAs suspended - Sakshi

గవర్నర్‌కు షబ్బీర్, రేవంత్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌: రెండు లాభదాయకమైన పదవుల్లో కొనసాగిన వారిపై వేటు వేయాలంటూ గవర్నరు దగ్గర పిటిషన్‌ వేసినట్టుగా శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నరును కలిసిన అనంతరం వారు విలేకరులతో  మాట్లాడారు. గవర్నరుకు వినతిపత్రం ఇవ్వలేదని, పిటిషన్‌ వేశామన్నారు. కేబినెట్‌లో 15 శాతానికి మించి మంత్రులుగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

చట్టాన్ని ఉల్లంఘించిన ఆప్‌ ఎమ్మెల్యేలపై వేటువేశారని గుర్తుచేశారు. తెలంగాణలోనూ అదే ఉల్లంఘనకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వేటువేయాలని, వారు తీసుకున్న జీతభత్యాలను రికవరీ చేయాలన్నారు. వీటిపై రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తింపు రద్దు చేసేదాకా గులాబీ కూలీపై పోరాడతామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top