‘రెండు సీట్లకూ ఒకేసారి ఉపఎన్నికలు పెట్టండి’ 

Congress Approaches Supreme Court Over Bypolls RS Seats in Gujarat - Sakshi

న్యూఢిల్లీ : గుజరాత్‌లో ఇటీవల ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు వేరుగా ఉపఎన్నికలను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గుజరాత్‌ శాసనసభలో ప్రతిపక్ష నేత పరేష్‌భాయ్‌ ధనానీ ఈ కేసు వేస్తూ, ఈ రెండు స్థానాలకూ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కోరారు. పరేష్‌భాయ్‌ పిటిషన్‌ను కోర్టు అత్యవసరంగా మంగళవారం విచారించే అవకాశం ఉంది. రెండు స్థానాలకు వేర్వేరుగా ఉప ఎన్నికను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, అక్రమం, చట్ట ఉల్లంఘన, నియంతృత్వ విధానమని పరేష్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గుజరాత్‌తోపాటు మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లకు ఒకేసారి ఉప ఎన్నికలను నిర్వహించేలా ఈసీని ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆయన కోరారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top