బెంగాల్‌లో తృణమూల్‌, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ | Clashes Erupt Between TMC And BJP Cadres In WB | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో తృణమూల్‌, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ

Apr 11 2019 10:04 AM | Updated on Apr 11 2019 3:07 PM

Clashes Erupt Between TMC And BJP Cadres In WB  - Sakshi

ఫైల్‌ఫోటో

బెంగాల్‌లో తృణమూల్‌, బీజేపీ బాహాబాహీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కూచ్‌బెహర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని దిన్‌హటలో తృణమూల్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. కాగా తృణమూల్‌ గూండాలు తమపై దాడులకు తెగబడ్డారని బీజేపీ ఆరోపించగా, కాషాయ పార్టీ కార్యకర్తలు తమపై దాడి చేసి కొట్టారని తృణమూల్‌ శ్రేణులు పేర్కొన్నాయి.

ఇక బెంగాల్‌లో పట్టు నిలుపుకోవాలని మమతా నేతృత్వంలోని పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ పట్టుదలతో పనిచేస్తుండగా, ఈ రాష్ట్రంలో కొన్ని సీట్లలోనైనా గెలుపొంది సత్తా చాటాలని బీజేపీ చెమటోడుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement