కోడెలపై కేసు.. అరెస్ట్‌కు వెనుకంజ

Chandrababu Moves to Mislead the Case of Kodela - Sakshi

ఇనిమెట్ల పోలింగ్‌ బూత్‌లో కోడెల అరాచకాల వీడియో వెలుగులోకి 

ఆయన దౌర్జన్యం వల్లే జనం తిరగబడ్డారనేది బహిర్గతం

వెంటనే సీఎంను ఆశ్రయించిన కోడెల

కేసును తప్పుదారి పట్టించేందుకు ఎత్తులు

తప్పు చేశామని తలపట్టుకున్న పోలీసులు 

సాక్షి, గుంటూరు: పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడడంతోపాటు ఆ తప్పును జనంపైకి నెట్టేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయిన కోడెల బుధవారం హడావుడిగా సీఎంతో సమావేశం కావడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్‌ ఏజెంట్లు, అధికారులపై కోడెల బెదిరింపులకు పాల్పడ్డ వీడియోలు వెలుగులోకి రావడంతో టీడీపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. మొదట్లో తప్పును గ్రామస్తులపై మోపి వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయించి ఎదురుదాడికి దిగుతూ వస్తున్న టీడీపీ నేతలు, వీడియోలు వెలుగులోకి రావడంతో తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. గ్రామస్తులు కోడెలపై దాడికి పాల్పడడం వల్లే ఆయన పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని కట్టు కథలు చెబుతూ వచ్చిన పోలీసులు ఇప్పుడు కేసును ఎలా తిప్పాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. కోడెల తప్పేమీ లేదంటూ వెనకేసుకు వచ్చిన పోలీసులు గ్రామస్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కోడెలపై కేసు నమోదు చేయకుండా వదిలేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ నేతలు దీనిపై ఎన్నికల కమిషన్‌తోపాటు గవర్నర్‌కు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో మంగళవారం కోడెలతోపాటు, మరో 21 మందిపై పోలీసులు ఇక తప్పదన్నట్లు కేసు నమోదు చేశారు. కోడెలను, ఆయన అనుచరులను అరెస్ట్‌ చేయొచ్చన్న భయం టీడీపీ నేతల్లో నెలకొంది.
పోలింగ్‌ బూత్‌కు గడియపెడుతున్న దృశ్యం  

పోలీసులపై ఒత్తిడి...
కోడెల దౌర్జన్యం బట్టబయలవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్‌కు వెనుకంజ వేస్తున్నారు. వారిపై ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి పోటీలో ఉన్న అభ్యర్థే పోలింగ్‌ అధికారులు, ఏజెంట్లపై బెదిరింపులకు దిగుతూ పోలింగ్‌ బూత్‌ తలుపులు మూసివేసి సుమారు రెండు గంటలపాటు ఎన్నిక నిలిచిపోవడానికి కారణమైన అంశం పెద్ద నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. పోలింగ్‌ బూత్‌లో రెండు గంటలపాటు కోడెల హల్‌చల్‌ చేస్తుండటంతో లోపల రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారనే అనుమానంతో ఆగ్రహించిన ఓటర్లు ఆయనపై తిరగబడ్డ విషయం తెలిసిందే. అయితే పోలీసులు మాత్రం అసలు నేరాన్ని తప్పించి, కోడెలపై దాడి జరిగిందనిచెప్పి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గ్రామంలో దొరికినవారిని దొరికినట్లు పోలిస్‌ స్టేషన్‌లకు ఈడ్చుకెళ్లారు. గొడవకు కారణం కావడంతోపాటు, పోలింగ్‌ నిలిపివేసిన కోడెల, ఆయన అనుచరులను వదిలేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ రాజుపాలెం మండలం ఇనిమెట్ల పోలింగ్‌ బూత్‌లో ఈ నెల 11వ తేదీన కోడెల పోలింగ్‌ను నిలిపివేసి చేసిన అరాచకం, దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు మంగళవారం రాత్రి వెలుగులోకి రావడంతో అటు టీడీపీ నేతలు, ఇటు పోలీసులు కంగుతిన్నారు. వీడియోల ద్వారా కోడెల అరాచక పర్వం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా ఆయనతోపాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి వదిలేశారు. బూత్‌లో హింసకు పాల్పడితే అరెస్టు కూడా చేయలేదంటే వారిపై అధికార పార్టీనుంచి ఏమేరకు ఒత్తిడి వచ్చిందో అవగతమవుతోంది.  

చంద్రబాబును కలిసిన కోడెల... ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు 
తన అరాచకానికి చెందిన వీడియోలు వెలుగులోకి రావడంతో కంగుతిన్న కోడెల మంగళవారం రాత్రే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇదంతా ఎన్నికల కమిషన్‌ చేసిన తప్పు అంటూ గగ్గోలు పెట్టారు. అరెస్ట్‌ భయంతో బుధవారం ఉదయం హడావుడిగా సీఎం చంద్రబాబును కలిశారు. ఆ తరువాతే వీడియో పుటేజీలు బయటకు తీయండంటూ కొత్తపల్లవి అందుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్లు, అధికారులపై బెదిరింపులకు దిగిన కోడెల తాజాగా కేంద్రం, ఎలక్షన్‌ కమిషన్‌ ఆంధ్రాలో గొడవలు జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర బలగాలు పంపలేదంటూ ఆరోపణలు ఎత్తుకున్నారు. వీడియోల ద్వారా కోడెల బండారం బట్టబయలైందని, పోలీసులు సైతం వీడియోలు చూసిన తరువాత తాము తప్పుచేశామనే అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కోడెల, ఆయన అనుచరులను అరెస్టు చేసి చట్టం అందరికీ సమానమే అనే విషయాన్ని పోలీసులు రుజువు చేయాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ విశ్లేషకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు

22-05-2019
May 22, 2019, 16:28 IST
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి...
22-05-2019
May 22, 2019, 16:06 IST
పార్టీ శ్రేణుల్లో భరోసా నింపిన రాహుల్‌, ప్రియాంక..
22-05-2019
May 22, 2019, 15:22 IST
వీవీప్యాట్ల లెక్కింపు : విపక్షాల వినతిని తోసిపుచ్చిన ఈసీ
22-05-2019
May 22, 2019, 15:15 IST
నామినేషన్ల గట్టం పూర్తయ్యే వరకు ఏ నియోజకవర్గంలో ఎవరు, ఎంత మంది నిలబడతారో తెలియదు. అలాంటప్పుడు ముందుగా ట్యాంపరింగ్‌ చేయడం...
22-05-2019
May 22, 2019, 14:55 IST
రిగ్గింగ్‌లో మీ ప్రమేయం ఉందా..?
22-05-2019
May 22, 2019, 13:40 IST
చంద్రబాబు నాయుడిని చూస్తే జాలిగా ఉందని, ఆయన మరీ దిగజారిపోతున్నారని...
22-05-2019
May 22, 2019, 13:37 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో సర్వీస్‌, పోస్టల్‌ బ్యాలెట్లు ఓట్లు భారీగా పోలైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. పోస్టల్‌...
22-05-2019
May 22, 2019, 12:19 IST
డిచ్‌పల్లి: రేపు నిర్వహించనున్న పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు  డిచ్‌పల్లిలోని సీఎంసీ కళాశాల కౌంటింగ్‌ కేంద్రం వద్ద అధికారులు ముమ్మరంగా...
22-05-2019
May 22, 2019, 11:52 IST
సాక్షి, తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్‌ సెంటర్‌. పట్టణానికి పెద్ద ల్యాండ్‌ మార్కు. ఎన్నికలొస్తే చాలు. ఇక్కడ సందడే సందడి....
22-05-2019
May 22, 2019, 11:37 IST
సాక్షి, శ్రీకాకుళం : శ్రీకాకుళం నియోజకవర్గంలోని శాసనసభ బరిలో నిలిచిన అభ్యర్థులు, వారి అనుయాయులు లెక్కలు కట్టడంలో నిమగ్నమయ్యారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే...
22-05-2019
May 22, 2019, 11:35 IST
లక్నో : గత ఏడాది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బులంద్‌షహర్‌ ప్రాంతంలోని నయాబన్స్‌ గ్రామంలో చేలరేగిన హింసాకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన...
22-05-2019
May 22, 2019, 11:25 IST
సాక్షి, అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరో 24 గంటల సమయమే ఉంది. ఫలితాలపై అభ్యర్థులతోపాటు జిల్లా...
22-05-2019
May 22, 2019, 11:09 IST
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మరో ఇరవై నాలుగు గంటలు గడిస్తే చాలు.. విజేతలు ఎవరో తేలిపోతుంది. ఉమ్మడి జిల్లాలోని భువనగిరి,...
22-05-2019
May 22, 2019, 11:08 IST
ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌ను నిలిపి వేయించడానికి చంద్రబాబు చేయని కుతంత్రం లేదు.
22-05-2019
May 22, 2019, 10:59 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సిక్కోలు జిల్లా... టీడీపీ ఆవిర్భావం నుంచీ కంచుకోటగా ఉంది! పది అసెంబ్లీ స్థానాల్లో ఇచ్ఛాపురం మినహా మిగిలిన...
22-05-2019
May 22, 2019, 10:56 IST
లక్నో: ఈ ఎన్నికల్లో తాను మూడు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించకపోతే ఈవీఎంల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లేనని...
22-05-2019
May 22, 2019, 10:52 IST
చివరకు..మల్కాజిగిరి ప్రకటన 
22-05-2019
May 22, 2019, 10:48 IST
సాక్షి, సిటీబ్యూరో:  సిటీలో గురువారం జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైదరాబాద్‌ జిల్లా పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు...
22-05-2019
May 22, 2019, 10:38 IST
నరాలు తెగే ఉత్కంఠ.. గెలిచేదెవరంటూ చర్చోపచర్చలు.. పందెంరాయుళ్ల బెట్టింగులు.. తమ అభ్యర్థే గెలుస్తాడంటే.. కాదు తమవాడే అంటూ సాగిన సవాళ్లు.....
22-05-2019
May 22, 2019, 10:30 IST
సాక్షి, ఒంగోలు అర్బన్‌ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 23వ తేదీ జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్నీ...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top