‘ఎన్నికలొస్తే సర్జికల్‌ స్ట్రైకులొస్తాయ్‌’

BJP govt times surgical strikes with elections - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలొచ్చినప్పుడే.. సరిహద్దుల్లో సర్జికల్‌ స్ట్రైకులొస్తున్నాయని.. వాస్తవ సమస్యలను మరుగుపరిచేందుకే బీజేపీ సైనికులను అడ్డుపెట్టుకుని ఆటలాడుతోందని కాంగ్రెస్‌ నేత అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, హరియాణా ఎన్నికలకు ఒక్కరోజు ముందే ఈ దాడులు బయటకు రావడం వెనుక మతలబేంటని ఆయన ప్రశ్నించారు. పెద్ద ఎన్నికలు వచ్చినప్పుడల్లా సర్జికల్‌ స్ట్రైక్స్‌ కనిపించడం మోదీ ప్రభుత్వంలో సర్వసాధారణమైందని ఎద్దేవా చేశారు.    అయితే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ సింఘ్వి మాత్రం భారత సైనికుల ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు. సైనికుల ధైర్యాన్ని చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top