ఏపీ, తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే

BJP Announces AP Telangana MP Candidates List - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఏపీకి సంబంధించి 12 మంది, తెలంగాణకు సంబంధించి 10 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం సాయంత్రం బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. నిన్న పార్టీలో చేరిన డీకే అరుణకు మహబూబ్‌నగర్‌ సీటు కేటాయించింది. సికింద్రాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ స్థానంలో కిషన్‌రెడ్డిని ఎంపిక చేశారు. బంగారు లక్ష్మణ్‌ కుమార్తె బంగారు శృతి.. నాగర్ కర్నూల్ స్థానం దక్కించుకున్నారు.

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు
నరసరావుపేట- కన్నా లక్ష్మీనారాయణ
విశాఖపట్నం - దగ్గుబాటి పురందేశ్వరి
నరసాపురం - పైడికొండల మాణిక్యాలరావు
ఏలూరు - చిన్నం రామకోటయ్య
హిందూపురం - పార్థసారధి
విజయనగరం - సన్యాసిరాజు
నెల్లూరు - సురేష్‌రెడ్డి
తిరుపతి - హరిరావు
నంద్యాల - ఆదినారాయణ
అనంతపురం - చిరంజీవిరెడ్డి
గుంటూరు - జయప్రకాశ్‌
కర్నూలు - పీవీ పార్థసారధి

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు
కరీంనగర్ - బండి సంజయ్
నిజామాబాద్ - అరవింద్
వరంగల్ - చింత సాంబమూర్తి
మహబూబ్ నగర్ - డీకే అరుణ
మల్కాజిగిరి - రామచంద్రరావు
సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి
భువనగిరి - శ్యామ్ సుందర్ రావు
నాగర్ కర్నూల్ - బంగారు శృతి
నల్గొండ - గార్లపాటి జితేందర్‌ రెడ్డి
మహాబూబాబాద్‌ - జాటోతు హుస్సేన్‌ నాయక్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top