భీమ్‌ ఆర్మీ చీఫ్‌ కొత్త రాజకీయ పార్టీ

Bhim Army chief Announces new political party  - Sakshi

‘ఆజాద్‌ సమాజ్‌ పార్టీ’గా నామకరణ

సాక్షి, నోడాయి: దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ఆజాద్‌ సమాజ్‌ పార్టీ’గా నామకరణం చేసి అధికారికంగా ప్రకటన చేశారు.  బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చంద్రశేఖర్‌ ఆజాద్‌ పార్టీ పేరును వెల్లడించారు. 

‘కాన్షీరాం చేపట్టిన మిషన్‌ అసంపూర్తిగా ఉంది. దాన్ని ఆజాద్‌ సమాజ్‌ పార్టీ పూర్తి చేస్తుంది’ అంటూ పార్టీ ప్రకటన అనంతరం చంద్రశేఖర్‌ ఆజాద్‌ ట్వీట్‌ చేశారు. 2022లో జరిగే ఎన్నికల్లో యూపీలో అధికారం చేజిక్కించుకునేందుకు అధికార బీజేపీతో పాటు ఎస్పీ,బీఎస్పీల మధ్య రసవత్తరమైన హోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటుతో యూపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. మరోవైపు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌, ఆర్‌ఎల్డీకి చెందిన 98మంది నాయకులు ఆజాద్‌ సమాజ్‌ పార్టీలో చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top