సంక్షేమ పథకాల రూపకర్త ఆయనే

Ambati Rambabu Fires On Chandrababu In Vijayawada - Sakshi

విజయవాడ: సంక్షేమ పథకాల రూపకర్త దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డేనని, అందుకే వైఎస్సార్‌ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిథి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ మరణం ఒక విషాదమని, మైనార్టీల గురించి ఆలోచించిన తొలి సీఎం వైఎస్సారేనని అన్నారు. వైఎస్సార్‌ హమారా అని ముస్లిం సోదరులు తమ గుండెల్లో దాచుకున్నారని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు కట్టడానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకువచ్చింది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డియేనని, ఆయన పుణ్యమే పోలవరం అని స్పష్టం చేశారు. రేపటి తొమ్మిదో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాన్ని ఊరూ వాడా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన మరణం తట్టుకోలేక అనేక మంది గుండెలవిసేలా రోదించారని, మరికొందరు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తే తప్పా, ఇది ప్రజాస్వామ్య దేశం కాదా అని ప్రశ్నించారు. డిమాండ్స్‌ కోసం అడిగితే కేసులు పెట్టి వేధిస్తారా అని సూటిగా అడిగారు. ముస్లిం ద్రోహి చంద్రబాబు అని, బీజేపీతో అంట కాగింది వాస్తవం కాదా ప్రశ్నించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top