
దర్పణం
ఒకడు కుంభాకారపుటద్దంలో నిలువునా సాగిపోతాడు
ఒకడు కుంభాకారపుటద్దంలో
నిలువునా సాగిపోతాడు
ఇంకొకడు పుటాకార దర్పణంలో
కుంచించుకు పోతాడు
మరొకడు మామూలు అద్దంలో
కుడి ఎడమలవుతాడు
అసలు సిసలు అంతర్దర్పణమొకటి
అందరిలోనూ దాగివుంటుంది
అందులో చూస్తేనే
అసలు రూపమేదో స్పష్టమవుతుంది
- పక్కి రవీంద్రనాథ్
9440364486
దేహమొకరహస్య బిలం
1
ఏ అపూర్వ రహస్యాన్ని ఛేదించడానికి
లోకం కడలిపైన ఈ దేహనావతో యాత్రిస్తున్నావు
అంతు చిక్కని ఒక రహస్యమేదో నీ
నావ లోలోపలే తిరుగుతున్నదని తెలుసా నీకు
2
ఇవాళ జీవకళతో మెరిసిపోయే ఈ నావని
పూల తీగల్లా అల్లుకున్న
నీ రక్త సంబంధాలు నీ స్నేహ సంబంధాలు
ఎవరికి తెలుసు- కొద్ది ప్రయాణంలోనే ఈ నావ
కళ తప్పి ఏ తుఫాను తాకిడికో ఛిద్రమయాక,
ఆగంతకుడిలా చొరబడిన అకాల
మృత్యువు రహస్యం తెలుసుకుంటావని
ప్రతిరోజూ నీ యాత్రను
దేహానికి నమస్కరించి ప్రారంభించు
లోపలి రహస్యగీతాన్ని ఆలపిస్తూ ప్రారంభించు
- కోడూరి విజయకుమార్
8330954074
చిన్న కవిత
తారలు
నీలి దుప్పటికి
ఒళ్లంతా కళ్లే
కన్ను రాలినా
కనబడని గాయం
నందిరాజు శ్రీనివాస్
8886663935