భాషా సంఘంలో రాజకీయం తగదు | Political is not language committee | Sakshi
Sakshi News home page

భాషా సంఘంలో రాజకీయం తగదు

Sep 9 2015 12:53 AM | Updated on Sep 3 2017 9:00 AM

భాషా సాహిత్యాల మీద ఉన్నతమైన పదవులలో ఉన్నవారు చెప్పే మాటలలో, ఇచ్చే వాగ్దానాలలో, చేసే నిర్ణయాలలో నిజాయితీ అవసరం.

భాషా సాహిత్యాల మీద ఉన్నతమైన పదవులలో ఉన్నవారు చెప్పే మాటలలో, ఇచ్చే వాగ్దానాలలో, చేసే నిర్ణయాలలో నిజాయితీ అవసరం. ఆగస్ట్ 29న విజయవాడలో జరిగిన గిడుగు రామమూర్తి 132వ వర్ధంతి సభలో ప్రభుత్వ పెద్దలు ఆడిన మాటలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇవాళ తెలుగును మరిచిపోతున్నామనీ, భాషను కాపాడుకో వడమంటే ఉనికిని కాపాడుకోవడమేననీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో అన్నారు. నిజంగా మన నేతలు భాషను కాపాడుకునే విధం గా, ఉనికిని చాటే అంశంగా గుర్తించి గౌరవిస్తున్నారా? త్వరలో ఏర్పాటు చేసే అధికార భాషా సంఘానికి పొట్లూరి హరికృష్ణ అనే ‘ప్రముఖ రచయి త’ను నియమించనున్నట్లు సీఎం ప్రకటించడం ఇలాంటి ప్రశ్నలకు ఆస్కారమిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం? ‘తెలుగు భాషా పరిర క్షణకు నడుం బిగిద్దాం’ అని ఆ సభలోనే సీఎం చెప్పిన మాటకూ ఈ చర్య కూ పొంతన ఉందా?
 
 ఆ హరికృష్ణ ఎవరు? తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించి, తెలుగువారి చరిత్రకు సంబంధించి ఆయన రాసిన పుస్త కాలు ఏమైనా ఉన్నాయా? పరిశోధన, రచన వంటి ఏ ఇతర కృషిలోనూ అంతగా పేరు వినిపించని వారిని తీసుకు వచ్చి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి నియమిస్తామని చెప్పడం, ఆ సంఘాన్ని రాజకీయ పున రావాస కేంద్రంగా మార్చే ప్రయత్నంగా ప్రజలు అర్థం చేసుకునే అవ కాశం లేదంటారా? గతంలో వావిలాల గోపాలకృష్ణయ్య, వందేమాతరం రామచంద్రరావు, దాశరథి కృష్ణమాచార్య, నండూరి రామకృష్ణమాచా ర్యులు, కొత్తపల్లి వీరభద్రరావు, పాకాల యశోదారెడ్డి ప్రభృతులు ఆ పద వికి ఎంపికయ్యారు. కానీ సీఎం నోటి నుంచి వచ్చిన వ్యక్తి పేరు ఇంత ప్రసిద్ధమైనదేనా? పోనీ ఆయన కృషి ఈ వ్యక్తుల కృషి స్థాయిలో ఉన్న దా? భాషా సేవ గురించి సీఎం చెప్పారు కాబట్టి, మైసూరులో ఏర్పాటైన తెలుగు పీఠం విషయం కూడా గుర్తుచేసుకోవాలి. ఆ పీఠం తెలుగు సాహి త్య, సాంస్కృతిక, చరిత్ర, సర్వతోముఖ  సత్వర వికాస సంస్థగా ఏర్పాటైంది. కానీ అది ఇప్పటికీ అక్కడే ఎందుకు ఉండిపోయింది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కోట్ల రూపాయల నిధులు మైసూరులో ఉన్న ఆ సంస్థకు వెళుతున్నాయన్న వాస్తవాన్ని ఎందుకు పరిగణనలోనికి తీసుకోవడం లేదు? తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చి పదేళ్లు గడుస్తున్నాయి.
 
 మరి గుర్తింపు వచ్చినా ఏమిటి ఉపయో గం? అలాగే కూచిపూడి పూర్వ వైభవం కోసం ఆ గ్రామానికి రూ.100 కోట్లు కేటాయించినట్టు కూడా విజయవాడ సభలో చెప్పారు. మరి ఆ గ్రామంలోనే ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం వారి దృశ్య, లలిత, అభి నయ కళాపీఠం భవిష్యత్తు ఏమిటి? తెలుగు భాష, కూచిపూడి నృత్యా లను అంతా నేర్వాలని, సజీవంగా ఉంచుకోవాలని పెద్దలు ఆకాంక్షిం చారు. వారి కుటుంబాలు కూడా ముందుకువస్తే దీనికి సార్థకత వస్తుంది.
 డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు  హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement