నేను నా పనిలో నిండా మునిగిపోయి ఉన్నప్పుడు
రాత్రి
నేను నా పనిలో
నిండా మునిగిపోయి ఉన్నప్పుడు
వెలుతురునెవరో దొంగిలించారు
పాపం
చిల్లుల సంచీతో వచ్చినట్టున్నారు
దారంతా నక్షత్రాలు
వెంకటేష్
8121533112
కర్ఫ్యూలోయ
మనుషుల జాడ లేక
కోయిలలు స్పృహ కోల్పోతున్నాయి
ఆకలి తీర్చే చేతుల కోసం
పావురాలు ప్రార్థనా మందిరాల్ని వెదుకుతున్నాయి
ముఖాల్ని పెద్దవి చేసుకుని
కుక్కలు నిర్మానుష్యమైన వీధుల కేసి చూస్తున్నాయి
వనాలూ వేదనతో కుమిలిపోతున్నాయి
విర పూసేందుకు పూలు మొరాయిస్తున్నాయి
కొమ్మల చుట్టూ మృత్యువులాంటి నిరాశ ఆవహించింది
మౌనాన్ని మంత్రించేందుకు నిరాకరిస్తూ
ఆర్ద్రమైన గాలి వెనుతిరుగుతోంది
ఎంత భయంకరంగా వుంది
ఈ సమాధి చెంత నిశ్శబ్దం!
మూలం: నజ్రత్ బజాజ్
తెలుగు: బొబ్బిలి శ్రీధరరావు
7660001271
గుర్తున్నంత వరకు
ముఖానికింత
నిమ్మాకు ముద్దని అద్దిన నల్ల జినపరాయి
అకస్మాత్తుగా
నెత్తుటి వమనంతో తడిసి ఎర్రబడింది
ఆ పొద్దున్నే
ముదురు వెదురు బద్దలు
మందార మొక్కలాంటి పాటని సాగనంపడం
ఊహించని వాళ్లొకవైపు
సన్నగా పారే ఏరొకవైపు
నోరు లేని చోట నిజానిది సుప్తావస్థ
కొన్ని చీలికలున్న నాలుకలు
తెరచాటు మాటని తలకెత్తుకున్నాయి
వీధి ఇప్పుడు
ధ్వంసం కాని దృశ్యానికి ముఖద్వారమయింది
నిశ్శబ్దం చెరచబడ్డాక
చితికిపోయిన అద్దం లాంటి కాలం
బోడికొండ మీదకు విసిరి వేయబడింది.
పాయల మురళీకృష్ణ
9441026977