
గ్రహం అనుగ్రహం, బుధవారం 1, జులై 2015
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవ త్సరం, ఉత్తరాయణం,
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవ త్సరం, ఉత్తరాయణం,
గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం
తిథి శు.చతుర్దశి ఉ.8.52 వరకు, తదుపరి పౌర్ణమి
నక్షత్రం మూల తె.3.59 వరకు (తెల్లవారితే గురువారం)
వర్జ్యం ప.12.06 నుంచి 1.43 వరకు
తదుపరి రా.2.22 నుంచి 3.57 వరకు
దుర్ముహూర్తం ప.11.35 నుంచి 12.25 వరకు
అమృతఘడియలు రా.9.44 నుంచి 11.18 వరకు
సూర్యోదయం : 5.32
సూర్యాస్తమయం: 6.34
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
భవిష్యం
మేషం: పనుల్లో స్వల్ప ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. దూరప్రయాణాలు చేస్తారు.
వృషభం: సోదరులు, సోదరీలతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
మిథునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
కర్కాటకం: కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
సింహం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.
కన్య: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. సోదరులతో విభేదాలు కలగవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
తుల: కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
వృశ్చికం: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.
ధనుస్సు: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలను సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ఒత్తిడులు.
కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాలు. పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మీనం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
- సింహంభట్ల సుబ్బారావు