
గ్రహం అనుగ్రహం, మంగళవారం 30, జూన్, 2015
శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం, తిథి శు.త్రయోదశి ఉ.8.55వరకు, తదుపరి చతుర్దశి నక్షత్రం జ్యేష్ఠ తె.4.10 వరకు, (తెల్లవారితే బుధవారం), వర్జ్యం ఉ.9.23 నుంచి 11.02 వరకు దుర్ముహూర్తం ఉ.8.09 నుంచి 9.01 వరకు, తదుపరి రా.10.55 నుంచి 11.45 వరకు అమృతఘడియలు రా.7.14 నుంచి 8.33 వరకు
సూర్యోదయం : 5.32
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం: ఉ.ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
భవిష్యం
మేషం: పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వస్తు, వస్త్ర లాభాలు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు అనుకోని హోదాలు అందే అవకాశం ఉంది.
మిథునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూ లాభాలు. యత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆలోచనలు కలిసి రావు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉండవచ్చు.
సింహం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి.
కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆస్తి లాభ సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నూతనోత్సాహం.
తుల: బంధువులతో విభేదాలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు.
వృశ్చికం: చిరకాల మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు.
ధనుస్సు: వ్యయప్రయాసలు. అనుకోని ధన వ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యభంగం. ప్రయాణాలలో మార్పులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
మకరం: కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.
కుంభం: విద్య, ఉద్యోగావకాశాలు. పనులు చకచకా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మీనం: వ్యయప్రయాసలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ ఎదురవుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.
- సింహంభట్ల సుబ్బారావు