
గ్రహం అనుగ్రహం, జులై 7, మంగళవారం 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం
శ్రీ మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
అధిక ఆషాఢ మాసం
తిథి బ.షష్ఠి రా.8.15 వరకు
నక్షత్రం పూర్వాభాద్ర రా.9.20 వరకు
వర్జ్యం ఉ.4.59 నుంచి 6.28 వరకు
దుర్ముహూర్తం ఉ.8.10 నుంచి 9.01 వరకు
తదుపరి రా.11.01 నుంచి 11.47 వరకు
అమృతఘడియలు ప.2.03 నుంచి 3.35 వరకు
సూర్యోదయం : 5.34
సూర్యాస్తమయం: 6.35
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
భవిష్యం
మేషం: కార్యజయం. బంధువుల కలయిక. విందు వినోదాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోగతి.
వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మిథునం: మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు పనిభారం.
కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కన్య: నూతనోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.
తుల: బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు అందుతాయి.
వృశ్చికం: మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
ధనుస్సు: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. భూ, వాహన యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మకరం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు.
కుంభం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక అభివృద్ధి. ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు గుర్తింపు రాగలదు. వ్యాపారాల్లో లాభాలందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు