
గ్రహం అనుగ్రహం, ఆదివారం 13, సెప్టెంబర్ 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం
తిథి అమావాస్య ఉ.10.40 వరకు
తదుపరి భాద్రపద శు.పాడ్యమి
నక్షత్రం పుబ్బ ప.1.10 వరకు, తదుపరి ఉత్తర
వర్జ్యం రా.9.09 నుంచి 10.53 వరకు
దుర్ముహూర్తం సా.4.24 నుంచి 5.15 వరకు
అమృతఘడియలు ఉ.6.22 నుంచి 7.59 వరకు
సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 6.03
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు
భవిష్యం
మేషం: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
వృషభం: శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నెలకొంటుంది.
మిథునం: పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
కర్కాటకం: ముఖ్యమైన పనులలో స్వల్ప ఆటంకాలు కలగవచ్చు. మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
సింహం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభవార్తలు అందుకుంటారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య: వ్యవహారాలలో అవరోధాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. దూర ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
తుల: వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. ప్రతిభా పాటవాలకు గుర్తింపు రాగలదు. ఆస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. పరిచయం. ఆసక్తి కరమైన సమాచారం అందుతుంది. విందు వినోదాలు. రావలసిన సొమ్ము అందుతుంది. భూ లాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి నెలకొంటుంది.
ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
మకరం: అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం: పరిచయాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలం వాతావరణం నెలకొంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మీనం: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందు వినోదాలు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
- సింహంభట్ల సుబ్బారావు