
గ్రహం అనుగ్రహం, జూన్ 28, ఆదివారం 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం
శ్రీ మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
అధిక ఆషాఢ మాసం
తిథి శు.ఏకాదశి ఉ.7.58 వరకు తదుపరి ద్వాదశి
నక్షత్రం విశాఖ రా.2.34 వరకు
వర్జ్యం ఉ.6.57 నుంచి 8.40 వరకు
దుర్ముహూర్తం సా.4.50 నుంచి 5.40 వరకు
అమృతఘడియలు సా.5.30 నుంచి 7.12 వరకు
సూర్యోదయం : 5.32
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు
భవిష్యం
మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు. కొత్త బాధ్యతలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
వృషభం: భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలందుతాయి. విద్యార్థులకు నూతన ఉత్సాహం. ఆలయదర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.
మిథునం: కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కర్కాటకం: రుణబాధలు. పని ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు కలిసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
సింహం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విందువినోదాలు. ఆస్తి లాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు.
కన్య: ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యభంగం. వ్యవహారాలు మందగిస్తాయి. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
తుల: ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాల్లో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
వృశ్చికం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. చోర భయం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.
ధనుస్సు: దూరపు బంధువుల కలయిక. ఇంటిలో విందువినోదాలు. మిత్రులతో వివాదాల పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
మకరం: ఇంటర్వ్యూలు రాగలవు. పనులు చకచకా పూర్తికాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజకనంగా ఉంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
కుంభం: కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు కలగవచ్చు. రుణ యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల కలయిక. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.
మీనం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో ఆటంకాలు. బంధువుల కలయిక. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ తప్పదు.
- సింహంభట్ల సుబ్బారావు