
గ్రహం అనుగ్రహం, మంగళవారం 23, జూన్ 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం
శ్రీ మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
అధిక ఆషాఢమాసం
తిథి శు.సప్తమి రా.1.20 వరకు
నక్షత్రం పుబ్బ ప.3.24 వరకు, తదుపరి ఉత్తర
వర్జ్యం రా.11.24 నుంచి 1.11 వరకు
దుర్ముహూర్తం ఉ.8.07 నుంచి 8.57 వరకు
తదుపరి రా.10.56 నుంచి 11.46 వరకు
అమృతఘడియలు ఉ.8.22 నుంచి 10.03 వరకు
సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం: 6.33
రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
భవిష్యం
మేషం: చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.
వృషభం: బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాల్లో ఆటంకాలు రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
మిథునం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. వాహన యోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటకం: శ్రమ తప్పదు. పనుల్లో ప్రతి బంధకాలు ఉండచ్చు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. అనారోగ్యం. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
సింహం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు.
కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయ వ్రయాసలు. మానసిక అశాంతి. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
తుల: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
వృశ్చికం: నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వస్తు, వస్త్ర లాభాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.
ధనుస్సు: దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ చెందుతారు.
మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు వస్తాయి. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్య సమస్యలు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కుంభం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మీనం: నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వస్తు లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం లభిస్తుంది.
- సింహంభట్ల సుబ్బారావు