
గ్రహం అనుగ్రహం, శుక్రవారం 19, జూన్ 2015
శ్రీమన్మథనామ సంవత్సరం
శ్రీమన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
అధిక ఆషాఢమాసం
తిథి శు.తదియ రా.7.16 వరకు
నక్షత్రం పునర్వసు ఉ.7.20 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం ..ప.3.50 నుంచి 5.34 వరకు
దుర్ముహూర్తం ఉ.8.10 నుంచి 8.59 వరకు
తదుపరి ప.12.29 నుంచి 1.21 వరకు
అమృతఘడియలు ఉ.4.53 నుంచి 6.30 వరకు
సూర్యోదయం: 5.30 సూర్యాస్తమయం: 6.32
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
భవిష్యం
మేషం: పనుల్లో స్వల్ప ఆటంకాలు కలుగుతాయి. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా చికాకులు పెరగవచ్చు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృషభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యవహారాల్లో విజయం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
మిథునం: కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. ధన వ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తు లాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
సింహం: మిత్రులతో మాటపట్టింపులు వస్తాయి. వ్యయప్రయాసలు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. దైవచింతన.
కన్య: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. అరుదైన సన్మానాలు అందుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి.
తుల: నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు అందుకుంటారు.త
వృశ్చికం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
ధనుస్సు: బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సాయపడతారు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
కుంభం: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పాతమిత్రులను కలుసుకుంటారు. కార్యజయం. ఊహించని సన్మానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
మీనం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.
- సింహంభట్ల సుబ్బారావు