
గ్రహం అనుగ్రహం, సోమవారం 20, జులై 2015
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం,
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం,
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢ మాసం,
తిథి శు.చవితి ఉ.10.48 వరకు, తదుపరి పంచమి,
నక్షత్రం పుబ్బ రా.10.51 వరకు,
వర్జ్యం ఉ.5.15నుంచి 7.01 వరకు,
దుర్ముహూర్తం ప.12.31 నుంచి 1.21 వరకు
తదుపరి ప.3.06 నుంచి 3.57 వరకు,
అమృతఘడియలు ప.3.49 నుంచి 5.30 వరకు
సూర్యోదయం : 5.39
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
భవిష్యం
మేషం: శ్రమాధిక్యం. ప్రయాణాలలో మార్పులు. అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
వృషభం: పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మిథునం: కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. శ్రమ ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కర్కాటకం: మిత్రులతో విభేదాలు. ఆలయ దర్శనాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
సింహం: యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. విందువినోదాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. దైవదర్శనాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
తుల: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
ధనుస్సు: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
మకరం: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. పనులు ముందుకు సాగవు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం: ఇంట శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనసౌఖ్యం. ఆస్తిలాభం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
- సింహంభట్ల సుబ్బారావు