‘ఓటుబ్యాంక్’లపై వృద్ధి తూటా | A develop bullet on vote bank for bihar assembly elections | Sakshi
Sakshi News home page

‘ఓటుబ్యాంక్’లపై వృద్ధి తూటా

Sep 14 2015 1:00 AM | Updated on Jul 18 2019 2:17 PM

‘ఓటుబ్యాంక్’లపై వృద్ధి తూటా - Sakshi

‘ఓటుబ్యాంక్’లపై వృద్ధి తూటా

బిహార్ యువత పెద్ద ఎత్తున ఆర్థిక తర్కానికే ఓటు వేస్తున్నారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిం దేమీ లేదు.

బిహార్ యువత పెద్ద ఎత్తున ఆర్థిక తర్కానికే ఓటు వేస్తున్నారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిం దేమీ లేదు. పరిస్థితులు ఇప్పుడున్నట్టుగా ఇలాగే ఉండిపోతే అతి ఎక్కువగా నష్టపోయేది వారే. వారి భవిత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. లాలూ, ఒక విచిత్ర మానసిక స్థితిలో, ఉపన్యాస ధోరణిలో కూరుకుపోయి ఉన్నారు. పావు శతాబ్దిగా అది మారలేదు. గతించిన కాలమనే అగాధంలోంచి విసుగెత్తించే అ పదబంధాలు, జోకులు, హావభావాలు ప్రతిధ్వనిస్తుంటాయి. ఆయన హాస్యం పొంగని బ్రెడ్డులా చదునుగా, బరువుగా ఉంటుంది.
 
 బిహార్ శాసనసభ ఎన్నికలు దురభిమానపూరిత సెంటిమెంట్‌కు, ఆర్థిక తర్కానికి మధ్య శక్తివంతమైన చర్చగా మారాయి. కుల, మతాలకు, సెంటిమెంటుకు దన్నుగా నిలచేవేమిటో మనకు సుపరిచితమే. మరి ఈ తర్కం ఏమిటి? ఈ ఎన్నికలు జరిగేది అభివృద్ధి గురించేనని అందరికీ తెలిసిందే. సుపరి పాలన లేనిదే అభివృద్ధి అసాధ్యం. సుపరిపాలనకు సుస్థిరత అవసరం. నితీష్ కుమార్ సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేరనడానికి ఆధారాలున్నాయి. లాలూప్రసాద్ యాదవ్, కాంగ్రెస్‌లతో కలసి ఆయన ఆకుకు అందని పోకకు పొందని అవకాశవాద కూటమిని ఏర్పరచారు.
 
 అందులోని భాగస్వాము లంతా ఒకరి వ్యక్తిగత ప్రతిష్టను మరొకరు భంగపరిచే చరిత్ర గల వారే. పైగా, వ్యక్తిగత స్థాయిలోనే కాదు, పునాది మద్దతుదార్ల స్థాయిలో కూడా వారు ఒకరి పట్ల మరొకరికి ఉన్న అసంతృప్తిని దాచుకునే ప్రయత్నమైనా చేయలేదు. వారితో పోలిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ పునాది దృఢంగా ఉన్నదనేది స్పష్టమే. పరిపాలించడానికి అది సంసిద్ధంగా ఉన్నదని విశ్వసిం చడానికి తగ్గ హేతువూ ఉంది. తార్కిక పరిభాషలో చెప్పాలంటే రుజువుతో నిర్ధారించడం (క్యూఈడీ) లేదా చేసి చూపడమే అందుకు నిదర్శనం.
 
 ‘‘అందరికీ అభివృద్ధి’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ నిలకడగా ఓటర్లకు ఒకే సందేశాన్ని ఇస్తున్నారు. బిహార్ అభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక పథకాలు దానికి దన్నుగా ఉండటంతో వారు ఆ సందేశానికి భారీ ఎత్తున స్పందిస్తున్నారు. పాత, కాలం చెల్లిన కుల, మతాలు ఇంతవరకు అక్కడి  ఓటర్లు ఎన్నికల్లో ఎవరిని ఎంచుకోవాలని నిర్ణయించుకునే విషయంలో కీలక చలాంకాలుగా ఉంటున్నాయి. ‘‘బిహారు ప్యాకేజీ’’ ఆ గాలి బుడగను బద్ధలు చేసి, మొత్తంగా పరిస్థితిలో పెను మార్పును కలుగచేసేది. రహదారులకు కులం ఉండదు. విద్యుత్తుకు జాతి ఉండదు. పేదరికానికి మతం ఉండదు.
 
  పేదల సామాజిక సంక్షేమమే లక్ష్యంగా చొరవతో చేపట్టిన జన్‌ధన్ యోజన, బీమా పథకాల వంటివి ప్రదర్శనాత్మక ప్రభావానికి తోడవుతాయి. బిహార్ యువత పెద్ద ఎత్తున తర్కానికే ఓటు వేస్తున్నారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. పరిస్థితులు ఇప్పుడున్నట్టుగా ఇలాగే ఉండిపోతే అతి ఎక్కువగా నష్టపోయేది వారే. కాబట్టి వారు అలాగే చేస్తారు. ఈ ఎన్నిక ల్లో వారి జీవితాలే పణంగా ఒడ్డి ఉన్నాయి. వారి భవిత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. 1990-1995 మధ్య కాలంలో పుట్టిన వారికి ఇప్పుడు ఇరవయ్యో, ఇరవైయైదేళ్లో ఉంటాయి. ఉద్యోగం గురించి ఆందోళన అతి తీవ్ర స్థాయిలో ఉండేది ఆ వయసులోనే.  కాబట్టి రానున్న ఐదేళ్లూ వారి భవితకు సంబంధించి కీలకమైనవి. ఇప్పుడు వారు వినాలని కోరుకుంటున్న మాటలనే నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. కాబట్టే వారికి ఆయన ధృవతారలా కనిపిస్తున్నారు. కడుపుమంటతో పార్టీని బెదిరించైనా పార్టీలో ప్రాధాన్యాన్ని సంపాదించగలమనుకున్న తిరుగుబాటుదార్లు సైతం... బిహారు యువత ఓటు భారీ ఎత్తున నరేంద్రమోదీకి అనుకూలంగా బదలాయింపు అవు తోందని అంగీకరించడం మొదలైంది. యువత, జనాభాపరమైన నూతన నిర్ణయాత్మక అంశాన్ని సృష్టించింది. అభిప్రాయ సేకరణలన్నీ కాకున్నా కొన్ని దాన్ని నమోదు చేయడం ప్రారంభించాయి. లాలూప్రసాద్ యాదవ్, ఒక మానసిక స్థితిలో, ఉపన్యాస ధోరణిలో కూరుకుపోయి ఉన్నారు. పావు శతాబ్ధకాలంగా అది మారలేదు. గతించిన కాలమనే అగాధంలోంచి విసు గెత్తించే అవే పదబంధాలు, జోకులు, హావభావాలు ప్రతిధ్వనిస్తుంటాయి. ఆయన హాస్యం ఈస్ట్ లోపించి పొంగని బ్రెడ్డు అంత చదునుగా, బరువుగా  ఉంటుంది.
 
 ఈ ఎన్నికల నాటకంలో ఏకైక విదూషక పాత్రను పోషిస్తున్నది బూట కపు ఉదారవాదులు మాత్రమే. అప్పుడప్పుడూ ఏైదైనా పత్రికల్లో కనిపించే సంపాదకీయ పేజీల వ్యాసాల ద్వారా, డ్రాయింగ్ రూమ్ సంభాషణల ద్వారా పునరు జ్జీవం పొందాలని వారు తెగ తాపత్రయపడుతున్నారు. కానీ కుల, మత నేతల ఆయుధాగారంలో సరికొత్త ఆలోచనలు ఏమీ లేకపోవడమే వాటి ప్రాధాన్యత క్షీణించిపోతుండటానికి కారణం. కానీ ఈ బూటకపు ఉదార వాదులు మాత్రం నరేంద్ర మోదీ ఆర్థిక తర్కం ప్రాతిపదికపై ఈ ఎన్నికల పోరాటం సాగిస్తుండటం వల్లనే బిహారు రెండు దశాబ్దాల క్రితం ఎక్కడుందో అక్కడే ఉండిపోతుందని గట్టిగా చెబుతున్నారు.   
 
 అలా అని పాత నిర్ణయాత్మక అంశాలన్నీ పూర్తిగా అంతరించి పోయి నట్టేనని నా అభిప్రాయం కాదు. కాకపోతే అవి ఇక ఎంతమాత్రమూ నిర్ణయాత్మకమైనవిగా లేవు. వాటి మార్కెట్టు కుచించుకుపోయింది. ప్రధాన ప్రవాహం దిశ మార్చు కుంటోంది. ఇటు పక్కన ప్రవాహం కుచించుకుపో తోందంటే అది అవతలి ఒడ్డున సంఘటితమయ్యే ధోరణిని ప్రదర్శిస్తుంది. ఈ ఎన్నికల్లో మనం చూస్తున్న మరో ముఖ్యాంశం ఇది. పునాదిలోనే విశ్వసనీయత లోపించినప్పుడు అది ఎల్లప్పుడూ అంచుల వద్ద చీలికలను ప్రేరేపిస్తుంటుంది. నితీష్‌కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌లు ఆ కులాలు, మతాల వారు ఎన్నటికీ  బీజేపీ వైపుకు పోరనే ఊహపై ఆధారపడి ఓటర్ల ఆమోదం తమకు లభించినట్టేనని భావిస్తు న్నారు. కానీ ఓటర్లు వారి నుంచి దూరంగా, మరో దిశకు పయనిస్తున్నారు. మరో విధంగా చెప్పాలంటే, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్‌కుమార్‌ల ప్రధాన ఓటర్లకు వారిపై ఇక ఎంత మాత్రమూ నమ్మకం లేదు. కాబట్టే ఇతర నేతలను అన్వేషిస్తున్నారు. ఒక భ్రమను ఎవరూ కొనరు. నితీష్, లాలూల తరఫున ప్రచారం కోసం అట్టహాసంగా స్వచ్ఛందంగా వచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా అంతకంటే తాను చేయగల మెరుగైన పనులు న్నాయని గ్రహించారు.
 
 బిహార్ ఎన్నికలపై నా అభిప్రాయం పక్షపాతంతో కూడినదని భావి స్తారనేది స్పష్టమే. ఆ పార్టీ సభ్యుణ్ణి కావడం వల్లనే నా అభిప్రాయాన్ని పక్షపాత పూరితమైనదిగా చూస్తారు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒక్క టే. ఒక్కసారి బిహార్‌కు వెళ్లి మీ కళ్లతో మీరే అక్కడ జరుగుతున్న ఓటర్లలో జరుగుతున్న మథనాన్ని చూడండి లేదా మరింత కచ్చితంగా చెప్పాలంటే విని రండి. మన  ప్రజాస్వామ్యం నిశ్శబ్దంగా ఉండే ఓటరుకు  ప్రసిద్ధి. కానీ ఈసారి బిహార్ ఓటరు నోరు విప్పుతున్నాడు. అలా అని ఎవరూ అరవడం లేదు. ఆ అవసరమూ లేదు. సాధారణంగానే ఉద్వేగంతోనో లేదా ఆగ్రహం తోనో గొంతులు పెరుగుతాయి, అయినా ప్రజల మనస్థితి ప్రశాంతంగా ఉంది. తమకు ఏమి కావాలో ప్రజలకు తెలుసు. ఓటింగ్ మొదలైనప్పుడు వారు తాము ఏమి కోరుకుంటున్నారో దాన్ని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు వారి మానసిక స్థితి వాదులాటకు సిద్ధంగా లేదు, ప్రశాతంగా ఉంది.
 
ఉత్సుకతను రేకెత్తిస్తున్నది ఒక్కటే... ప్రస్తుత స్థితి తలకిందులు కావడ మనేది ప్రభుత్వంలో మార్పునకు మించినదాన్ని దేన్నో ప్రతిఫలించవచ్చు. చర్చ ఇప్పుడు సాంప్రదాయకమైన కుల, మత పెద్దల నియంత్రణలో లేదు. యువత దాన్ని మలుస్తోంది. నేతల విన్యాసాలతో యువత విసిగి పోయింది. అది జీవితాన్ని కోరుకుంటోంది.  
  (వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి)
 - ఎం.జె. అక్బర్
 సీనియర్ సంపాదకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement