
సోయం బాపురావు, ఎంపీ, ఆదిలాబాద్ ,బోర్లకుంట వెంకటేశ్‌నేత, ఎంపీ, పెద్దపల్లి
నిర్మల్: విదేశీ వ్యవహారాల శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలు నియమితులయ్యారు. ఇటీవల ప్రకటించిన ఈ కమిటీలో సోయం బాపురావు(ఆదిలాబాద్–బీజేపీ), బోర్లకుంట వెంకటేష్ నేత (పెద్దపల్లి – టీఆర్‌ఎస్)లకు స్థానం దక్కింది. తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వీరిద్దరూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారే. ఈ కమిటీకి చైర్మన్‌గా రాజస్థాన్‌లోని పాళికి చెందిన బీజేపీ ఎంపీ ప్రేమ్‌ప్రకాష్ చౌదరి నియమితులయ్యారు. ఇందులో 21 మంది లోక్‌సభ సభ్యులు, పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపీలు నియమితులు కావడంపై స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.