‘సంపద’పెంచుకున్న ప్రవాసాంధ్రులు

sampada invites applications for new academic year - Sakshi

వాషింగ్టన్​: డబ్బు మాత్రమే సంపద కాదు. కళ కూడా ఓ సంపదే. ఆ సంపద సంపాదనలో కొందరు ప్రవాసాంధ్రుల పిల్లలు ముందడుగేశారు. కరోనా కష్టకాలంలో ఇంటి నుంచే సాంస్కృతిక కళల పరీక్షల్లో పాల్గొన 1500 మంది ప్రవాసాంధ్రుల పిల్లలు ఉత్తీర్ణులయ్యారని సిలికానాంధ్ర మ్యూజిక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్​ అండ్ డాన్స్ అకాడమీ(సంపద) డీన్, ప్రెసిడెంట్ దీనబాబు కొండుభట్ల పేర్కొన్నారు. 

తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సంపద ద్వారా ప్రవాసంలో నివసిస్తున్న తెలుగు వారి పిల్లలకు కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణనిస్తున్నట్లు ఆయన తెలిపారు. పక్కా పాఠ్యప్రణాళికలతో నిర్వహించే కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి జూనియర్​, సీనియర్​ సర్టిఫికెట్స్​ అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది 1500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా పాసైన వాళ్లకు సర్టిఫికేట్లు అందించినట్లు వివరించారు.

కోవిడ్–19 కష్టకాలంలో పరీక్షలను ఇళ్లలో సజావుగా నిర్వహించిన సంపద సభ్యులు ఫణి మాధవ్ కస్తూరి, శాంతి కొండా, ఉష మాడభూషి , తెలుగు విశ్వ విద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డా. రెడ్డి శ్యామలను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసించారని చెప్పారు.

వచ్చే విద్యా సంవత్సరంలో చేరదలచిన విద్యార్ధులు SAMPADA.SILICONANDHRA.ORG వెబ్​సైట్​లో నమోదు చేసుకోవాలని సూచించారు. కరోనా కాలంలో ప్రవాసాంధ్రులకు సాంత్వన చేకూర్చేందుకు సంపద రూపొందించిన కార్యక్రమాలకు అద్భుతమైన స్పందన వచ్చినట్లు వెల్లడించారు. మ్యూజిక్​పై నిర్వహించిన కాంపిటీషన్​కు 550 మంది నమోదు చేసుకున్నట్లు చెప్పారు.

తొలి విడతలో ఐదు నగరాలలో నిర్వహించిన ప్రాంతీయ పోటీలలో గెలుపొందిన 65 మంది జూలై 11, 12 తేదీల్లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని సిలికానాంధ్ర వాగ్గేయకార ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ నాదెళ్ల తెలిపారు. ఈ పోటీలకు సాంకేతిక నిర్వహణ బాధ్యతను సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఆగస్టు 8, 9 తేదిల్లో కర్ణాటక సంగీత వాద్య పరికరాలు వీణ, వయోలిన్, ఫ్లూట్, మృదంగంలో కుడా అంతర్జాలం ద్వారా  పోటీలు నిర్వహించబోతుఉన్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనాలనుకునే వారు త్యాగయ్య,  దీక్షితార్, శ్యామ శాస్త్రి కృతులను ఎంచుకుని, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాలకు vaggeyakara.siliconandhra.org వెబ్​సైట్​ని సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమాలు ఫేస్​బుక్​, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. 

సంపద కార్యక్రమాలు విజయవంతం కావడానికి నార్త్ కరోలినా నుంచి గౌతమి మద్దాలి, మల్లికా వడ్లమాని, వర్జీనియా నుంచి సిలికానాంధ్ర ఉపాధ్యక్షురాలు మాధురి దాసరి, రత్నవల్లి తంగిరాల, మాచిరాజు సుబ్రహ్మణ్యం, న్యూజెర్సీ నుంచి విజయ తురిమెల్ల, బాలు పసుమర్తి, లక్ష్మి నండూరి, రవి కామరసు, సిలికానాంధ్ర ఉపాధ్యక్షుడు శరత్ వేట, చికాగో నుంచి మాలతీ దామరాజు, శాంతి చతుర్వేదుల, సిలికానాంధ్ర ఉపాధ్యక్షురాలు సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని, కాలిఫోర్నియా నుంచి మమత కూచిభొట్ల, సృజన నాదెళ్ల, నారాయణ్ రాజు, సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాధ్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ తదితరులు కృషి చేస్తున్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top