లాక్‌డౌన్‌లో తెలుగువారికి అండగా నాట్స్‌

NATS Supplies Essentials to Telugu People Living In Tampa Bay - Sakshi

 మెక్సికో: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాబేలో తెలుగువారికి నిత్యావసరాలు పంపిణీ చేసింది. కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ విధించడంతో  ఇబ్బందులు పడుతున్న భారతీయుల కోసం నాట్స్ టెంపాబే విభాగం స్పందించి  నిత్యావసరాల సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను దాదాపు 300 మందికిపైగా అందించింది. స్థానికంగా ఉండే బటర్ ప్లై ఫార్మసీ కూడా దీనికి తన వంతు సహకారం అందించింది.  అవసరమైన వారికి మాస్కులు, గ్లౌజులు కూడా నాట్స్ పంపిణీ చేసింది. (చిన్నారుల ఆశ్రమానికి నాట్స్ చేయూత)

ప్లోరిడా హౌస్ ప్రతినిధి మిస్ డయాన్ ఈ పంపిణీ కార్యక్రమానికి హాజరై నాట్స్ నాయకులను అభినందించారు. ఈ కష్టకాలంలో నాట్స్ ముందుకు వచ్చి సాయం చేయడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. స్థానిక పోలీసులు కూడా డ్రైవ్ త్రూ లైన్ లలో ట్రాఫిక్‌ను మళ్లించి ఈ పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చేశారు. దీనికి నాట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాట్స్  టెంపా బే కోర్ టీం సభ్యులు శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని,రాజేశ్ కాండ్రు, శ్రీనివాస్ మల్లాది, ప్రసాద్ ఆరికట్ల, సుధీర్ మిక్కిలినేని తదితరులు ఈ నిత్యావసరసరుకుల ఉచిత పంపిణీ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు.   బటర్ ఫ్లై ఫార్మసీ నుంచి జన్ను కుటుంబం, టోని, టుటూ తో పాటు ఫార్మసీ కార్యాలయం సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరుకులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, సెక్రటరీ విష్ణు వీరపనేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మురళీ మేడిచర్లకు నాట్స్ టెంపాబే టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. టెంపాబే స్ఫూర్తితో మరిన్ని ఛాప్టర్లలో నాట్స్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టనుంది.(శాన్ఎన్టానియోలో నాట్స్ ఉదారత)

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top