చిన్నారుల ఆశ్రమానికి నాట్స్ చేయూత

NATS Donates food to poor in Telugu states - Sakshi

నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసిన నాట్స్

సాక్షి, (సికింద్రాబాద్/ వైజాగ్) : లాక్‌డౌన్ సమయంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తన సేవా కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తెలుగునాట లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలు, అనాథలకు నాట్స్  ఉచితంగా పలుప్రాంతాల్లో  నిత్యావసరాలు, ఆహారం అందిస్తోంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌లోని మంచికలలు అనే చిన్నారుల ఆశ్రమానికి నాట్స్ ఉచితంగా నిత్యావసరాలు పంపిణి చేసింది. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి చొరవతో  పిల్లల ఆకలి తీర్చేందుకు నాట్స్ ఈ మంచి పని చేపట్టింది. తెలుగునాట నిరుపేదల ఆకలిబాధల విషయం తమ దృష్టికి వస్తే వెంటనే స్పందించి తగు సాయం చేస్తామని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు.

విశాఖలో నాట్స్ నిత్యావసరాల పంపిణీ
విశాఖపట్నంలో నాట్స్, గ్లో సంస్థతో కలిసి పేదలకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేసింది. విశాఖలోని షీలానగర్ పెట్రోల్ బంక్ వద్ద ఆటో, లారీ డ్రైవర్లకు నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసింది. గ్లో సంస్థ నుంచి వెంకన్న చౌదరితో పాటు నాట్స్ ప్రతినిధిగా సూర్యదేవర రామానాయుడు ఈ నిత్యావసరాలను పేదలకు పంపిణీ చేశారు. కష్టకాలంలో తమకు నిత్యావసరాలు ఉచితంగా ఇచ్చి ఎంతో మేలు చేశారని డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.


 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top