డాలస్‌లో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు

Mahatma Gandhi 150th Birth Anniversary celebrations in Dallas - Sakshi

మహాత్మా గాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యం లో అక్టోబర్ 6న ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఇర్వింగ్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా (1201 హిడెన్ రిడ్జ్ డ్రైవ్, ఇర్వింగ్, టెక్సాస్) వద్ద మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఈ వేడుకలకు టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ముఖ్య అతిధి గా విచ్చేసి మహాత్మాగాంధీకి నివాళులర్పించి ప్రసంగిస్తారని, ఇర్వింగ్ పట్టణ మేయర్ రిక్ స్టాప్ఫేర్, టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి జూలీ జాన్సన్, డిప్యూటీ కాన్సల్ జనరల్ అఫ్ ఇండియా సురేంద్ర అదానా ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారని ప్రకటించారు. 

ఈ వేడుకలలో భాగంగా శాంతికి సంకేతం గా 15 పావురాలను గాల్లోకి వదులుతామని.. ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్వర్యంలో "గాంధీ శాంతి యాత్ర" జరుగుతుందని అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. ప్రవేశం ఉచితమని, బ్రేక్ ఫాస్ట్ , టి షర్ట్స్, అందజేసాస్తామన్నారు. గాంధీ మెమోరియల్‌కు సమీపంలో ఉన్ననార్త్ లేఖ్ కాలేజ్ నుంచి గాంధీ మెమోరియల్‌కు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు, తమ కార్లను అక్కడ పార్క్ చేసి ఉదయం 7:30 నుంచి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలియజేశారు.

గాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, బి. ఎన్. రావు, జాన్ హామేండ్, రావు కల్వాల, టయాబ్ కుండావాల, పియూష్ పటేల్, అక్రం సయెద్, కమల్ కౌశిల్ , అభిజిత్ రాయల్కర్, మురళి వెన్నం, రన్నా జాని, ఆనంద్ దాసరి, డా. సత్ గుప్తా, శ్రీకాంత్ పోలవరపు, శ్రీధర్ తుమ్మల, షబ్నం మోడ్గిల్, గుత్తా వెంకట్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top