టెంపాలో నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కు విశేష స్పందన

Excellent Response To NATS Food Drive At Tampa - Sakshi

టెంపా: ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌) ఈ సారి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'భాషే రమ్యం.. సేవే గమ్యం' అనే నినాదంతో తన సేవాపథంలో భాగంగా టెంపాలో క్యాన్డ్‌ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. అన్నార్థుల ఆకలి తీర్చే లక్ష్యంతో చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌కు స్థానిక తెలుగువారి నుంచి విశేష స్పందన లభించింది. రెండు వారాల సమయంలోనే  1000ఎల్‌బీల ఫుడ్ క్యాన్స్‌ను తెలుగువారు విరాళంగా అందించారు. విరాళాల రూపంలో సేకరించిన ఫుడ్ క్యాన్స్‌ను స్థానిక ఫీడింగ్ అమెరికా టెంపా డౌన్ టౌన్‌కు నాట్స్ నాయకత్వ బృందం అందించింది. పేదలకు ఉచితంగా  ఫీడింగ్ టెంపాబే సంస్థ ఆహారాన్ని అందిస్తుంది. నాట్స్ చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌పై ఫీడింగ్ టెంపాబే సంస్థ ప్రశంసల వర్షం కురిపించింది.

పేదలకు ఆకలి తీర్చడంలో నాట్స్  కూడా తన వంతు పాత్ర పోషించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. నాట్స్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ జాతీయ నాయకులు ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ టెంపాబే చాప్టర్ కోఆర్డినేటర్ రాజేశ్ కాండ్రులు ఫుడ్ క్యాన్స్‌ను ఫీడింగ్ టెంపాబే సంస్థకు అందించడంతో పాటు అమెరికాలో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ ఫుడ్ డ్రైవ్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ అచ్చి, శ్రీనివాస్ బైరెడ్డి, సతీశ్ పాలకుర్తి, శ్రీధర్ గౌరవెల్లి, శ్రీనివాస్ మల్లాది, ప్రసాద్ కొసరాజు, సుథీర్ మిక్కిలినేని, రమ కామిశెట్టి తదితరులను నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top