అట్లాంటాలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

Dr YSR Birth Anniversary Celebrations in Atlanta - Sakshi

అట్లాంటా :  అమెరికాలోని అట్లాంటాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రవాసాంధ్రులు వైఎస్సార్‌ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, కోన రఘుపతి, కొరముట్ల శ్రీనివాసులు, పార్టీ నేతలు నందమూరి లక్ష్మీపార్వతి, పద్మజా రెడ్డి పాల్గొన్నారు. నంద గోపినాథ్‌ రెడ్డి, శ్రీనివాసులు కొట్లురె, వెంకట రామ్‌ చింతమ్‌, గిరీష్‌ మేక, ఉపెందర్‌ రెడ్డి రాచమళ్లు సత్య నారాయణ రెడ్డి, టీ. గౌతమ్‌ గోలి, ధనుంజయ రెడ్డి, కిరణ్‌ కందుల, వంగిమాల శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్సార్‌ అభిమానులు సునీల్‌ కొవ్వురు, ఉమా కల్వకుర్తి, గోరు పరందామి, నరసింహారెడ్డి, నాగేంద్ర సింగ్‌ రాయ్‌, శ్రీనివాస రఘువర్‌ వడ్రేవు, ఇజాక్‌ విశాల్‌ శ్యామ్యుల్‌, అశ్విన్‌ కుమార్‌, రాజ సురేంద్రనాథ్‌ బాబు, ఉపేంద్ర సల్తూరి, రవిపోనంగి, డా. శశి, అనిల్‌ యెర్రపా రెడ్డి, వెంకట్‌ పబ్బులేటి, పుల్లా రెడ్డి, కిరణ్‌ సలికి రెడ్డి, రఘు సగిలిలు ఈకార్యక్రమం విజయవంతం చేయడంలో తమవంతు కృషి చేశారు.

గోపినాథ్‌ రెడ్డి అతిథులను వేధికపైకి ఆహ్వానించగా, వారు వైఎస్సార్‌తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. మాతృభూమికి వేల కిలోమీటర్ల అవతల ఉన్నా, ప్రవాసాంధ్రులు వైఎస్సార్‌పైన చూపిస్తున్న అభిమానం చూస్తుంటే కడపలో ఉన్నాననే అనుభూతి కలుగుతోందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన కుంటుపడిందని, తిరిగి రాజన్న రాజ్యం రావాలంటే అందరం సమిష్టిగా కృషి చేయాలన్నారు. అట్లాంటాలో రెండో సారి ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని  కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. వరల్డ్‌ బ్యాంక్‌ జీతగాడుగా పేరు పొంది రాష్ట్రాన్ని రుణాంద్రప్రదేశ్‌గా చంద్రబాబు మార్చితే.. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని వైఎస్సార్‌ 90 వేల కోట్లకి బడ్జెట్‌ని పెంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని చేపట్టారని లక్ష్మీపార్వతి కొనియాడారు. శ్రీనివాస్‌ తన గాత్రంతో అందరిని ఆకట్టుకోగా, రఘు సగిలి, గిరీష్‌ మేక, శ్రీనివాస్‌ కొట్లూరులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top