వేగంగా వస్తున్న రైలు ముందు పరిగెత్తుతూ సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించిన ఓ 16 ఏళ్ల యువకుడు దుర్మరణం పాలయ్యాడు.
చెన్నై: వేగంగా వస్తున్న రైలు ముందు పరిగెత్తుతూ సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించిన ఓ 16 ఏళ్ల యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన చెన్నై శివారులోని వందలూరు సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై జరిగింది. ఆదివారం సాయంత్రం తన స్నేహితుడితో కలసి వాకింగ్ వెళ్లిన దినేష్ అనే యువకుడు.. వేగంగా వస్తున్న సబర్బన్ ట్రైన్ ముందు పరిగెత్తుతూ సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో రైలు కింద పడి మరణించాడు.
విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల ముంబై దగ్గర అరేబియా మహా సముద్రంలో సెల్ఫీ తీసుకునే క్రమంలో నీటిలో పడిపోయిన యువతిని కాపాడే క్రమంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే.