ప్రియుడితో కలిసి క్వారంటైన్ కు.. ఆపై.. | Woman Constable in Nagpur Taken Lover as Husband To Quarantine Center | Sakshi
Sakshi News home page

పక్కా ప్లాన్‌తో ప్రియుడితో కలిసి క్వారంటైన్‌కు..

Jul 17 2020 12:03 PM | Updated on Jul 17 2020 3:08 PM

Woman Constable in Nagpur Taken Lover as Husband To Quarantine Center - Sakshi

ముంబై: క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా ఒక మహిళా కానిస్టేబుల్ తన పాడు బుద్ధిని చూపించింది. తన ప్రియుడితో కలిసి క్వారంటైన్‌లో ఉండటానికి స్కెచ్‌ వేసి అధికారులను సైతం బురిడి కొట్టించింది. ప్రియుడినే  భర్త అని నమ్మించి అధికారుల నుంచి అనుమతి తీసుకుంది. అయితే, ప్రియుడి భార్యకు విషయం తెలిసి ఆమె రావడంతో ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగింది. నాగపూర్‌లో పనిచేస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్‌కు, మరో ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.

చదవండి: సీఎం ఇంటి ఎదుట కరోనా బాధితుడి ఆందోళన

దీంతో వారిద్దరిని క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా ఉన్నాతాధికారులు అదేశించారు. అయితే ఆ లేడీ కానిస్టేబుల్‌ ప్రియుడిని భర్తగా చూపి అతనికి కూడా కరోనా సోకి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేసింది. దీంతో అతనిని కూడా ఆమెతో పాటు పంపి క్వారంటైన్‌లో ఒకే  గదిలో ఉంచారు. దీని తరువాత తన భర్త,  ప్రియురాలితో కలిసి క్వారంటైన్ సెంటర్ లో ఉన్నాడని తెలుసుకున్న అతని భార్య, అక్కడికి వచ్చినా ఆమెను క్వారంటైన్‌ సెంటర్‌లోకి అనుమతించలేదు. దీంతో ఆమె బజాజ్ నగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లి, తన భర్తపై ఫిర్యాదు చేసింది. లేడీ కానిస్టేబుల్‌కు, తన భర్తతో ఉన్న బంధం గురించి వివరించింది. విచారణ జరిపిన అధికారులు, ఆమె నిజం చెప్పిందని నిర్ధారించుకొని, అతన్ని మరో క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. సదరు మహిళా కానిస్టేబుల్ నిర్వాకంపై విచారణ చేపట్టారు. 

చదవండి: ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఆ తర్వాత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement