అడ్డొస్తున్నాడని కొడుకునే కడతేర్చిన తల్లి | Woman arrested for beating three-year-old son to death | Sakshi
Sakshi News home page

అడ్డొస్తున్నాడని కొడుకునే కడతేర్చిన తల్లి

Nov 23 2016 3:22 PM | Updated on Sep 4 2017 8:55 PM

అడ్డొస్తున్నాడని కొడుకునే కడతేర్చిన తల్లి

అడ్డొస్తున్నాడని కొడుకునే కడతేర్చిన తల్లి

వివాహేతర సంబంధం ఓ చిన్నారిని చిదిమేసింది.

పూణే: వివాహేతర సంబంధం ఓ చిన్నారిని చిదిమేసింది. తమ బంధానికి మూడేళ్ల చిన్నారి అడ్డొస్తున్నాడని ఓ తల్లి కన్నకొడుకునే హతమార్చింది. నాందేడ్కు చెందిన భారతీ బాబురావ్ షిండే(35)కు ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్ల కిందట ఆమె భర్త మృతిచెందాడు. అనంతరం ఇంట్లోనుంచి చిన్న కుమారునితో ముంబైకి వచ్చిన తనకు కుమార్ పరిచయమయ్యాడు.

భారతీ బాబురావ్ షిండే తన ప్రియుడితో ఉన్న సమయంలోనే మంగళవారం చిన్నారి విషయమై తీవ్రవాగ్వాదం జరిగింది. అయితే మూడేళ్ల చిన్నారి తమ బంధానికి అడ్డొస్తున్నాడని భావించిన ఆ మహిళ చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా కొట్టింది. అనంతరం ఆ చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకురావడంతో అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. భారతీ బాబురావ్ షిండే తన మూడేళ్ల కుమారున్ని ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఆమెను ఆరెస్టు చేసి, కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement