ఫ్రీగా మంచాలు ఇస్తారనే వెళ్లాం | went to rahul meeting only to get free cots, say villagers | Sakshi
Sakshi News home page

ఫ్రీగా మంచాలు ఇస్తారనే వెళ్లాం

Sep 14 2016 5:04 PM | Updated on Sep 4 2017 1:29 PM

ఫ్రీగా మంచాలు ఇస్తారనే వెళ్లాం

ఫ్రీగా మంచాలు ఇస్తారనే వెళ్లాం

మళ్లీ అదే సీన్ రిపీటైంది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో రాహుల్ గాంధీ బహిరంగ సభ అలా ముగిసిందో లేదో.. వచ్చినవాళ్లంతా మంచాల కోసం కొట్టుకున్నారు.

మళ్లీ అదే సీన్ రిపీటైంది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో రాహుల్ గాంధీ బహిరంగ సభ అలా ముగిసిందో లేదో.. వచ్చినవాళ్లంతా మంచాల కోసం కొట్టుకున్నారు. కొద్ది సెకండ్లలోనే అక్కడ వేసిన మంచాలన్నీ మాయమైపోయాయి. 'మంచాలు అక్కడే వదిలేసి వెళ్లండి' అంటూ మైకులలో ప్రకటించినా.. ఎవరూ వినిపించుకోలేదు. అసలు తమకు ఉచితంగా మంచాలు ఇస్తామని చెప్పడం వల్లే మీటింగుకు వచ్చామని కైలాష్ నాథ్ కేసరి అనే పెద్దాయని చెప్పారు. ఈ  సమావేశానికి హాజరైతే చాలు.. ఉచితంగా మంచాలు ఇస్తారని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు తమకు చెప్పారని ఆయన మీడియాతో అన్నారు. అయితే, తనకు మాత్రం మంచం ఇవ్వలేదు గానీ.. చేతిలో ఈ జెండా పెట్టి పోయారని కాంగ్రెస్ జెండాను చూపించారు.

మీర్జాపూర్‌ నుంచి రెండోదశ కిసాన్ యాత్రను ప్రారంభించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మదీహాన్ అనే ప్రాంతంలో ఖాట్ సభ ఏర్పాటుచేశారు. బుధవారం నాడు ఆయన మొత్తం 164 కిలోమీటర్ల మేర యాత్ర సాగిస్తారు. ఇది మీర్జాపూర్, భదోహి, అలహాబాద్ జిల్లాల్లో జరుగుతుంది. వీటిలో కొన్ని ఖాట్ సభలు, మరికొన్ని బహిరంగ సభలు ఉంటాయి. యూపీలో మొత్తం 2,500 కిలోమీటర్ల మేర యాత్రను రాహుల్ తలపెట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement