వైరల్‌ : ఫైన్‌ వేశారని నానా రభస చేశాడు

Viral Video About Meerut Man Throws Bike After Fined For Not Wearing Helmet - Sakshi

మీరట్‌ : ఒక వ్యక్తి తాను హెల్మెట్‌ పెట్టుకోలేదని పోలీసులు ఫైన్‌ వేయడంతో బైక్‌ను కిందపడేసి నానా రభస చేసిన ఘటన శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. మీరట్‌కు చెందిన ఒక వ్యక్తి బైక్‌పై వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. హెల్మెట్‌ ధరించనందుకు చలాన్‌ వేస్తున్నట్లు అతనికి తెలిపారు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా తన బైక్‌ను కింద పడేసి రోడ్డుపై రెండు సార్లు అటూ ఇటూ దొర్లించి తర్వాత అదే బైక్‌పై కూర్చొని ఏడ్వడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. అతని వింత ప్రవర్తన అర్థంగాక పోలీసులు ఆ వ్యక్తిని సముదాయించేందుకు ప్రయత్నించారు. కాగా మొత్తం 43 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో నెటిజన్లు ఈ వీడియోనూ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ' పోలీసులు చలాన్‌ వేస్తే కడితే కట్టాలి లేకపోతే లేదు కానీ ఇలా చేయడం ఏంటని' కామెంట్లు పెడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top