
భోపాల్ : దసరా వేడుకల్లో భాగంగా ఆయుధ పూజను పురస్కరించకుని గ్వాలియర్ స్కూల్‌లో ఏడు రౌండ్లు కాల్పులు జరిపిన ఘటనలో 150 మంది వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ కార్యకర్తలపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 8న మంగళవారం దసరా నేపథ్యంలో ఏటా నిర్వహించే ఆయుధ పూజలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్‌లో శాస్త్ర పూజ కార్యక్రమంలో పాల్గొన్న వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ కార్యకర్తలు చేపట్టిన ప్రదర్శన ముగిసిన వెంటనే స్కూల్‌లోకి చొరబడిన కార్యకర్తలు గన్స్ నుంచి కాల్పులు జరిపారని సమాచారం. పోలీసులు వారించినా కార్యకర్తలు ఫైరింగ్‌ను కొనసాగించారని, ఏడు రౌండ్ల బుల్లెట్లను కాల్చారు. ఈ ఘటన జరిగిన వెంటనే కార్యకర్తలు ఫైరింగ్ జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.