రాహుల్‌ గాంధీతో ఉత్తమ్‌ భేటీ | Uttam meeting with Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీతో ఉత్తమ్‌ భేటీ

Jan 14 2017 2:09 AM | Updated on Sep 19 2019 8:44 PM

రాహుల్‌ గాంధీతో ఉత్తమ్‌ భేటీ - Sakshi

రాహుల్‌ గాంధీతో ఉత్తమ్‌ భేటీ

కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్య క్షుడు రాహుల్‌ గాంధీ తో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.

తెలంగాణలో పార్టీ పరిస్థితిపై చర్చ

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్య క్షుడు రాహుల్‌ గాంధీ తో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవ లంబిస్తున్న ప్రజావ్యతిరేకతపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల గురించి రాహుల్‌కు వివ రించినట్లు తెలిపారు.

నోట్లరద్దు అమలు లో కేంద్రం ఏవిధంగా విఫలమైందో గ్రామాల్లో ప్రజలకు వివరించాలని రాహుల్‌ సూచించినట్లు చెప్పారు. అలాగే కొత్త జిల్లాలకు పార్టీ కమిటీల నియామకంపై చర్చించినట్లు చెప్పారు. అందరికీ న్యాయం చేస్తూ కొత్త జిల్లా కమిటీలు నియమించాలని సూచించి నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement