నేపాల్‌లో ప్రమాదం.. ఇద్దరు భారతీయుల మృతి

Two Indian pilgrims died in Nepal Road accident - Sakshi

కాట్మండు : నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందగా, 21 మందికి గాయాలయ్యాయి. రౌతాహత్‌ జిల్లాలో భారత యాత్రికులతో వెళుతున్న బస్సు పవురాయ్‌ అటవి ప్రాంతంలో ఓ ట్రక్కును ఢీకొట్టింది. జనక్‌పుర్‌ నుంచి కట్మాండు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. మృతులు ఒడిషాకు చెందిన బిజయ్‌ కుమార్‌ జెనా(52), చరణ్‌ బిషాల్‌ (54)లుగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top