దొంగలు బాబోయ్‌ దొంగలు..

Train Passengers Steals Toilet Things And Fans - Sakshi

న్యూఢిల్లీ : రైల్వే సమాన్ల దొంగతనం జరగడం కొత్తకాకపోయిన చోరికి గురౌతున్న వస్తువుల గురించి తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతకు ముందు రైలు పట్టాలను ఎత్తుకెళ్లెవారు. ప్రస్తుతం బాత్‌రూంలో ఉన్న సమాన్లను కూడా దొంగలు వదలట్లేదని రైల్వే అధికారులు వాపోతున్నారు. బాత్‌రూంలో ఉండే మగ్గులు, వాష్‌బెసిన్‌లు, బోగిలో ఫ్యాన్‌లను చోరి చేస్తున్నారని అధికారులు తెలిపారు. కిటికిలకు ఉండే ఇనుప కడ్డీలు, పట్టాలు ఎక్కువగా చోరి అవుతున్నట్టు వెల్లడించారు. 2017-18 సంవత్సరానికి గాను చోరి అయిన దాదాపు రూ. 2.97 కోట్ల విలువైన వస్తువులను రైల్వే పోలీసులు పట్టుకున్నారు.

దీనికి రెండింతలు గత సంవత్సరం స్వాధీనం చేసుకున్నట్టు తెలపారు. కొన్ని సార్లు ప్రయాణికులు సీట్ల నారను, మగ్గులను వారి బ్యాగులలో తీసుకెళ్లడం తాము గమనిస్తామని, అవి సాధారణంగా జరిగేవే. కానీ రైలు పట్టాల చోరీ మాత్రం భారీ రైలు ప్రమాదాలకు దారి తీస్తుందని అన్నారు. దొంగలు ఎక్కువగా రైలు పట్టాలు, ఫిష్‌ ప్లేట్స్‌, వాష్‌ బెసిన్‌, అద్దాలు, ట్యాబులు, కేబుల్స్‌, సోలార్‌ ప్లేట్స్‌, టెలిఫోన్లు, బ్యాటరీలు, ఫ్యాన్లు, స్విచ్‌లను లక్ష్యంగా చేసుకుని దొంతనాలకు పాల్పడుతుంటారని తెలిపారు.  

2016-17 సంవత్సరానికి గాను 5,219 దొంగతనం కేసులు నమోదు కాగా, వాటికి సంబంధించి 5,458 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు. 2017-18 గాను 5,239 కేసులు నమోదు అయ్యాయి. ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది కొరత వల్లే దొంగతనాలను అరికట్టలేకపోతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 74,456 మందికి గాను కేవలం 67,000 మంది సిబ్బందే ఉన్నట్టు తెలిపారు. వారిలో ఎక్కువ శాతం పోలీసు స్టేషన్లకే పరిమితమవ్వడం వల్ల యాంటీ తెఫ్ట్‌ డ్రైలను నిర్వహించలేక పోతున్నామని అన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top