బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని ప్రధాని మోదీ బీజేపీ..
న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటు సభ్యులకు పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం ఇక్కడ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎన్ని అవాంతరాలు సృష్టించినప్పటికీ కేంద్రంలో బీజేపీ సర్కారు అనేక ముఖ్యమైన బిల్లులు ఆమోదించిందని చెప్పారు.
విపక్షాల విమర్శలతో పక్కదారి పట్టవద్దని, సుపరిపాలన, అభివృద్ధిపైనే దృష్టి నిలపాలని తెలిపారు. రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టం చేయాలన్నారు. డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ఈ నెల 25న పేదలకు ప్రత్యేక పథకంతోపాటు అనేక పథకాలు ప్రారంభిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ చెప్పారు.