కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం నేడే | Supreme Court new Judges sworn in today | Sakshi
Sakshi News home page

కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం నేడే

Jan 18 2019 3:49 AM | Updated on Jan 18 2019 3:49 AM

Supreme Court new Judges sworn in today - Sakshi

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి,

న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా శుక్రవారం సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌.. జస్టిస్‌ మహేశ్వరి, జస్టిస్‌ ఖన్నాలతో ప్రమాణం చేయించనున్నట్లు గురువారం ఒక అధికార ప్రకటన వెలువడింది. సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ ఎస్‌ఏ బాంబ్డే, జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాలతో కూడిన కొలీజియం ఈ నెల 10వ తేదీన ఈ ఇద్దరు న్యాయమూర్తులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement