అనిల్‌ అంబానీకి ఊరట

Supreme Court Disposes Of Contempt Case Against Anil Ambani - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎరిక్సన్‌ ఇండియాకు చెల్లించాల్సిన రూ 453 కోట్లు క్లియర్‌ చేయడంతో ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసును సర్వోన్నత న్యాయస్ధానం బుధవారం కొట్టివేసింది. అనిల్‌ కంపెనీకి ఆయన సోదరుడు ముఖేష్‌ అంబానీ బాసటగా నిలవడం, కంపెనీ ఆస్తులను జియో కొనుగోలు చేయడంతో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఎరిక్సన్‌కు బకాయిలను చెల్లించింది.

అంతకుముందు రిలయన్స్‌ జియోకు ఆస్తులు విక్రయించినప్పటికీ తమ బకాయిలను చెల్లించలేదని ఎరిక్సన్‌ సుప్రీంలో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేయగా, అనిల్‌ అంబానీతో పాటు రిలయన్స్‌ టెలికం చైర్మన్‌ సతీష్‌ సేథ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ చీఫ్‌ ఛాయా విరానీలను నిందితులుగా సుప్రీం విచారణ సాగింది. నాలుగు వారాల్లోగా ఎరిక్సన్‌ ఇండియాకు రూ 453 కోట్లను చెల్లించాలని లేనిపక్షంలో మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వారికి రూ కోటి చొప్పున జరిమానా కూడా విధించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top