గర్భంలో ఉన్న శిశువులకు ముందస్తు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుర్గావ్: గర్భంలో ఉన్న శిశువులకు ముందస్తు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రేవరిలో ఎనిమిదిమంది నిందితులను అరెస్ట్ చేశారు. గుర్గావ్ డిప్యూటీ సివిల్ సర్జన్ నీలమ్ థాపర్, డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ అమన్దీప్ చౌహాన్, గుర్గావ్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు.
ఎనిమిదిమంది నిందితులతో పాటు గర్భస్థ శిశువుకు లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు వచ్చిన సరిత అనే గర్భిణిని, ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖోల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గర్భిణి అయిన రష్మీ సాయంతో ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. నకిలీ వైద్యుడు చరణ్ సింగ్ ఒక్కో పరీక్షకు 17 వేల రూపాయల చొప్పున ఫీజుగా వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.