నల్లధనం కేసులో మూడు బ్యాంకులపై సెబీ కన్ను | Sebi eyes on 3 banks in black money case | Sakshi
Sakshi News home page

నల్లధనం కేసులో మూడు బ్యాంకులపై సెబీ కన్ను

Nov 2 2014 6:23 PM | Updated on Apr 3 2019 5:16 PM

నల్లధనం కేసులో భారత ప్రభుత్వం మూడు బ్యాంకులపై దృష్టిసారిస్తోంది.

న్యూఢిల్లీ: నల్లధనం కేసులో భారత ప్రభుత్వం మూడు బ్యాంకులపై దృష్టిసారిస్తోంది. నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో దేశంలోకి మళ్లీ తరలిస్తున్నారని సెబీ గుర్తించింది. ఈ దిశగా ముమ్మరంగా దర్యాప్తు చేపట్టింది.

రెండు స్విస్ బ్యాంకులు, ఒక యూరప్ బ్యాంక్పై సెబీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 15-20 భారతీయ కంపెనీలపై సందేహాలున్నాయని ఓ సీనియర్ అధికారి చెప్పారు. బ్లాక్మనీ దర్యాప్తు కేసుతో స్విస్ బ్యాంకుల్లో ఆందోళన నెలకొంది. నల్లధనానికి సంబంధించి భారత్తో ఒప్పందం ఉండేలా చూడాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement