సల్మాన్ ఫ్యాన్స్‌కు నిరాశ! | Salman won't be able to croon for Randeep Hooda | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఫ్యాన్స్‌కు నిరాశ !

Apr 13 2016 7:00 PM | Updated on Sep 3 2017 9:51 PM

సల్మాన్ ఫ్యాన్స్‌కు నిరాశ!

సల్మాన్ ఫ్యాన్స్‌కు నిరాశ!

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అభిమానులకు కొంత నిరాశ కలగనుంది. ఆయన రణదీప్ హుడా కోసం పాట పాడటం లేదని తెలిసింది.

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అభిమానులకు కొంత నిరాశ కలగనుంది. ఆయన రణదీప్ హుడా కోసం పాట పాడటం లేదని తెలిసింది. సుల్తాన్ సినిమా షూటింగ్ తో బిజిబిజీగా ఉన్న సల్మాన్... గతంలో మేహూ హీరో తేరా, హ్యాంగోవర్ వంటి పాటలు పాడి అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రణదీప్ హూడా కోసం ఓ పాటను పాడిద్దామనుకున్నారు. అదే విషయాన్ని గతంలో రణదీప్ వెల్లడించాడు కూడ.

సయ్యద్ అహ్మద్ అఫ్జల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లాల్ రంగ్'  సినిమా కోసమే సల్మాన్ తో పాట పాడించాలని అనుకున్నారు. కానీ, ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు రావడం, మరోపక్క, సుల్తాన్ చిత్రంతో సల్మాన్ ఖాన్ బిజీబిజీగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి సల్మాన్ పాట పాడలేకపోవచ్చని, తదుపరి చిత్రం కోసం పాడించే ప్రయత్నం చేస్తామని రణ్ దీప్ స్వయంగా చెప్పారు. అక్షయ్ ఓబ్రాయ్, పియా బాజ్ పేయ్ ప్రముఖ తారాగణంగా రూపొందుతున్న లాల్ రంగ్ చిత్రం ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధమౌతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement