కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ముప్పు | Rijiju's chopper makes emergency landing at Hindon airbase | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ముప్పు

Feb 9 2016 2:29 PM | Updated on Jul 11 2019 6:33 PM

కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ముప్పు - Sakshi

కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ముప్పు

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, మరో బీజేపీ ఎంపీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, మరో బీజేపీ ఎంపీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇంజన్‌లో సమస్య తలెత్తడంతో దాదాపు 20 నిమిషాల పాటు గాల్లోనే తిరిగిన చాపర్‌ను, పైలట్ కష్టమ్మీద కిందకు దించాడు. తామంతా సురక్షితంగానే ఉన్నామని ఆ తర్వాత రిజిజు తెలిపారు. మాలా రాజ్యలక్ష్మి షా అనే ఎంపీ కూడా రిజిజుతో పాటు ఉన్నారు. వారిద్దరినీ ఆ తర్వాత ఎంఐ-17వి5 హెలికాప్టర్‌లో తరలించారు.

ఇంజన్ విఫలం అయ్యే సమయానికి హెలికాప్టర్‌లో మొత్తం 8 మంది ఉన్నారు. వాళ్లలో హోం మంత్రిత్వ శాఖ అధికారులు, ఇద్దరు టీవీ జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఇంజన్‌లో సమస్య వచ్చినట్లు గుర్తించిన పైలట్, సుమారు 20 నిమిషాల తర్వాత దాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement