ప్రత్యేక హోదాపై చర్చ: రాజ్యసభ రేపటికి వాయిదా | Rajyasaba adjourned till tomorrow on AP special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాపై చర్చ: రాజ్యసభ రేపటికి వాయిదా

Jul 28 2016 9:43 PM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదాపై చర్చ: రాజ్యసభ రేపటికి వాయిదా - Sakshi

ప్రత్యేక హోదాపై చర్చ: రాజ్యసభ రేపటికి వాయిదా

ఏపీ ప్రత్యేక హోదాపై గురువారం జరిగిన చర్చ రేపటికి వాయిదా పడింది.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చ వాడీవేడీగా కొనసాగింది. ప్రత్యేక హోదాపై చర్చలో పాల్గొన్న సభ్యులంతా తమ వాదనలను బలంగా వినిపించారు. ఏపీ విభజన చట్టం అమలుపై స్వల్పకాలిక చర్చ అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఉపఛైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు. గురువారం ప్రత్యేక హోదాపై జరిగిన స్వల్పకాలిక చర్చను రేపు కొనసాగిద్దామంటూ సభను వాయిదా వేశారు. దాంతో శుక్రవారం కూడా ఏపీ ప్రత్యేక హోదాపై చర్చ కొనసాగనుంది.

మధ్యాహ్నం 2.30 లేదా సాయంత్రం 5 గంటలకు చర్చ ప్రారంభం కానుంది. రాజ్యసభ ఛైర్మన్‌ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఏపీ ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై మరో ముగ్గురు ఎంపీలు మాట్లాడనున్నారు. అనంతరం ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమాధానం ఇవ్వనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement