లైంగిక దాడి చేస్తే ఇక ఉరే

Rajasthan Passes Bill For Death Penalty For Rape Of Girls - Sakshi

చట్టం చేసిన రాజస్థాన్‌ సర్కార్‌

నేర తీవ్రతను బట్టి శిక్షలు పెంచే అవకాశం

సాక్షి, రాజస్థాన్‌ : రాజస్థాన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్లపై లైంగిక దాడికి పాల్పడితే మరణశిక్ష విధించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందుకు ఉద్దేశించిన బిల్లును శుక్రవారం ఆ రాష్ట్ర శాసన సభ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం పన్నెండేళ్లు అంతకంటే తక్కువ వయసు గల బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వారికి మరణ శిక్ష లేదా పద్నాలుగేళ్లకు తగ్గకుండా కఠిన కారాగార శిక్ష, లేదా 20 సంవత్సరాల యావజ్జీవ కఠిన కారాగార శిక్ష లేదా చనిపోయే వరకు జైల్లోనే ఉంచేందుకు అవకాశం కల్పించారు. రాజస్థాన్‌ హోంమంత్రి గులాబ్‌ చంద్‌ ఈ బిల్లును (క్రిమినల్‌ లా బిల్లు-2018) ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. దేశంలో మధ్యప్రదేశ్‌ తర్వాత ఇలా ప్రత్యేకంగా చట్టం చేసింది తాజగా రాజస్థానే. మహిళలపై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్‌ నాలుగో స్థానంలో ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top