రాజీవ్‌కు ‍ప్రధాని మోదీ, సోనియా నివాళి | Prime Minister Narendra Modi Pays Tribute To Rajiv Gandhi | Sakshi
Sakshi News home page

దేశ వ్యాప్తంగా రాజీవ్‌ జయంతి వేడుకలు

Aug 20 2019 9:03 AM | Updated on Aug 20 2019 11:13 AM

Prime Minister Narendra Modi Pays Tribute To Rajiv Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాజీవ్‌ సమాధి వీర్‌భూమిలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నివాళి అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విటర్‌ వేదికగా ఆయనను స్మరించుకున్నారు. 

దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల్లో రాజీవ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు గాంధీ భవన్‌లో రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమజిగూడలో ఆయన విగ్రహానికి పూలవేసి నివాళులు అర్పిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement