ఒంటరి పోరుపై పార్టీల ఆసక్తి | political parties Interested on a single match | Sakshi
Sakshi News home page

ఒంటరి పోరుపై పార్టీల ఆసక్తి

Oct 29 2014 2:12 AM | Updated on Mar 29 2019 9:24 PM

జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని 87 స్థానాలకు ఐదుదశల్లో జరగనున్న ఎన్నికల్లో దాదాపు పార్టీలన్నీ ఒంటరిపోరుపైనే ఆసక్తి చూపుతున్నారుు.

ప్రభుత్వం ఏర్పాటు చేస్తావుంటూ బీజేపీ ధీమా


జమ్మూ/శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని 87 స్థానాలకు ఐదుదశల్లో జరగనున్న ఎన్నికల్లో దాదాపు  పార్టీలన్నీ ఒంటరిపోరుపైనే ఆసక్తి చూపుతున్నాయి. ఎన్డీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ, జమ్మూ కాశ్మీర్ ప్రస్తుత పాలకపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీడీపీ, జేకేఎన్‌పీపీ సహా పార్టీలన్నీ ఒంటరి పోరుకే మొగ్గుచూపుతున్నాయి.

జార్ఖండ్‌తో పాటు కాశ్మీర్‌లో వచ్చే నెల 25న 15 సీట్లలో జరగబోయే తొలిదశ పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ వుంగళవారం నోటిఫికేషన్ జారీచేసిన నేపథ్యంలో పలు పార్టీలు అభ్యర్థుల జాబితాను, ఎన్నికల ప్రణాళికలను వెల్లడించవలసి ఉంది. కాగా అన్ని సీట్లకూ పోటీచేస్తావుని బీఎస్పీ, ఎన్సీ సూచనప్రాయుంగా ప్రకటించారుు. ఎన్సీ మిత్రపక్షమైన కాంగ్రెస్ కూడా వుుందస్తు పొత్తుపై పెదవివిప్పలేదు.

అన్ని సీట్లకూ పోటీచేస్తాయిటూ బీజేపీ సోవారమే ప్రకటించింది. 44కుపైగా సీట్లను గెలుచుకుంటావుని, కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేస్తాని జమ్మూకాశ్మీర్ బీజేపీ ఇన్‌చార్జి అవినాశ్ రాయ్ ఖన్నా ధీవ్యక్తంచేశారు. 60సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారుచేశా

ని బీఎస్పీ నేత తులసీదాస్ లాంగే చెప్పారు. ఒంటరిపోరుకు సిద్ధవుని ఎన్సీ నేత ఠాకూల్ రణధీర్ సింగ్, పీడీపీ ప్రతినిధి నయూమ్ అఖ్తర్ తెలిపారు. రెండు రోజుల్లో అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటిస్తావుని చెప్పిన కాంగ్రెస్ జమ్మూకాశ్మీర్ చీఫ్ సైఫుద్దీన్ సోజ్ పొత్తు విషయుమై పెదవి  విప్పలేదు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (జేకేఎన్‌పీపీ) కూడా ఒంటరి పోరుకే ఆసక్తిచూపుతోంది.


సోషల్ మీడియూ ద్వారా బీజేపీ  ప్రచారం

హారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గణనీయు విజయూలు సాధించిన బీజేపీ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఊపును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, కాశ్మీర్‌లో ఓటర్లను చేరువయ్యేందుకు సోషల్ మీడియూను విస్త­ృతంగా వినియోగించుకోవాలని నిర్ణరుుంచుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement