హమ్మయ్య... నిలబడుతోంది! | Sakshi
Sakshi News home page

హమ్మయ్య... నిలబడుతోంది!

Published Thu, Mar 31 2016 11:32 AM

హమ్మయ్య... నిలబడుతోంది! - Sakshi

డెహ్రడూన్: ఉత్తరాఖండ్ లో బీజేపీ ఎమ్మెల్యే దాడిలో గాయపడిన పోలీసు గుర్రం 'శక్తిమాన్' కోలుకుంటోంది. కృత్రిమంగా అమర్చిన కాలుతో నిలబడగలుగుతోందని 'శక్తిమాన్'కు చికిత్స చేస్తున్న డాక్టర్ రాకేశ్ నాటియాల్ తెలిపారు. ఎటువంటి ఇబ్బంది లేకుండానే నిలబడగలగుతోందని చెప్పారు. అంతకుముందుతో పోలిస్తే 'శక్తిమాన్' ఆరోగ్య పరిస్థితిలో చెప్పుకోదగ్గ మెరుగుదల కనిపిస్తోందన్నారు. కొన్ని రోజుల్లో నడవగలుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

డెహ్రడూన్ లో ఇటీవల ప్రతిపక్షాల ఆందోళన సందర్భంగా బీజేపీ నేతలు జరిపిన  దాడిలో ఈ తెల్ల గుర్రం తీవ్రంగా గాయపడింది. దీంతో దాని వెనుకకాలిని తొలగించి, కృత్రిమకాలు అమర్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement